Skill: నైపుణ్య అంతరం ఉత్పాదకతపై ప్రభావం - Productivity is affecing because of shortage of Unskill Labour
close

Updated : 01/08/2021 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Skill: నైపుణ్య అంతరం ఉత్పాదకతపై ప్రభావం

70% ఉద్యోగుల అభిప్రాయం: సర్వే

ముంబయి: తమ ఉద్యోగాన్ని నిర్వర్తించడానికి ఉండాల్సిన నైపుణ్యాలకు, తమకున్న నైపుణ్యాలకు మధ్య అంతరం ఉందని 70 శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నట్లు ఒక సర్వే చెబుతోంది. ఐటీ, ఆర్థిక, ఎఫ్‌ఎమ్‌సీజీ వంటి పలు రంగాల్లోని 2500కి పైగా మందిపై ఉద్యోగాల వెబ్‌సైట్‌ అయిన సైకీ మార్కెట్‌ నెట్‌వర్క్‌ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం..

ఇప్పటికే తమ కంపెనీలు ఈ నైపుణ్య కొరత అంశాన్ని ఎదుర్కొంటున్నాయని లేదా రాబోయే 2-3 ఏళ్లలో ఎదుర్కోవాల్సి రావొచ్చని 70% మంది వృత్తినిపుణులు చెబుతున్నారు.

విద్యా సంస్థల్లో తాము నేర్చుకున్న అంశాలు ఇపుడు తాము చేస్తున్న పనిలో ఉపయోగపడుతున్నాయని కేవలం 10 శాతం మందే భావిస్తున్నారు.

నైపుణ్య అంతరం వల్ల కంపెనీలకు ఆదాయ నష్టం వాటిల్లవచ్చని 35 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. పనిలో నాణ్యత తగ్గుతుందని మరో 45% మంది అంటున్నారు. వ్యాపార విస్తరణలకు ఈ నైపుణ్య కొరత అడ్డుతగులుతుందని 40% మంది అంచనా వేస్తున్నారు.

అత్యవసరంగా ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని ఐటీ రంగంలో 60% మంది; డేటా అనలిటిక్స్‌లో 33% మంది సూచిస్తున్నారు.

భవిష్యత్‌లో డేటా అనలిటిక్స్, వెబ్‌ డిజైన్, ఐటీ రంగాలు 60%, 38%, 33% మేర ప్రస్తుతం, భవిష్యత్‌లో నైపుణ్య కొరతకు గురి అవుతున్నాయని/అయ్యే అవకాశం ఉందని సర్వేలో తేలింది.

పరిశోధన-అభివృద్ధి, కస్టమర్‌ సర్వీస్, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్, ఫైనాన్స్‌ వంటి రంగాల్లోనూ సమీప భవిష్యత్‌లో 28%, 20%, 29%, 15% మేర నైపుణ్యాల కొరత కనిపించొచ్చని అంచనా.

సమస్య పరిష్కారానికి అంతర్గత శిక్షణా అకాడమీల ఏర్పాటు(45%), తరచూ వర్క్‌షాపుల నిర్వహణ(53%), సంబంధిత అంశాలతో లైబ్రరీని అందించడం(23%) వంటివి కంపెనీలు చేస్తున్నాయని తెలిపారు. ఇక సొంతంగా నేర్చుకుంటున్నామని 20% మంది చెబుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని