నష్టమొచ్చినా సరే వారికి పారితోషికం చెల్లించాల్సిందే..! - Profit or loss Non Executive directors of companies must get paid
close

Published : 20/03/2021 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టమొచ్చినా సరే వారికి పారితోషికం చెల్లించాల్సిందే..!

కంపెనీల చట్టం-2013లో ప్రభుత్వ సవరణలు

దిల్లీ: లాభమొచ్చినా.. నష్టమొచ్చినా ఇకపై కంపెనీలోని స్వతంత్ర డైరెక్టర్లతో పాటు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు పారితోషికం చెల్లించేలా కంపెనీల చట్టం-2013లో ప్రభుత్వం సవరణలు చేసింది. సంస్థలో కార్యనిర్వాహక పదవుల్లో ఉన్న వ్యక్తుల పారితోషికంలో ఐదో వంతు వారికి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. నష్టాల్లో ఉన్న లేదా సరిపడా లాభాల్లో లేని కంపెనీలు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, స్వతంత్ర డైరెక్టర్లకు పారితోషికం ఇవ్వడానికి అనుమతి లేదు. కేవలం వారికి సిట్టింగ్‌ ఫీజు కింద కొంత మొత్తం లభించేది. దీంతో ప్రతిభగల లేదా అనుభవం కలిగిన మానవ వనరుల్ని నియమించుకునేందుకు కంపెనీలకు ఇది ఒక అడ్డంకిగా ఉండేది.

తాజా నిబంధనల ప్రకారం.. నెగెటివ్‌ ఎఫెక్టివ్‌ క్యాపిటల్‌ లేదా రూ.ఐదు కోట్ల కంటే తక్కువ ఎఫెక్టివ్‌ క్యాపిటల్‌ ఉన్న సంస్థలు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు రూ.12 లక్షల పారితోషికం చెల్లించవచ్చు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు రూ.60 లక్షలు చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే కంపెనీ వాటాదార్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి...

టీసీఎస్‌ ఉద్యోగులకు వేతనపెంపు

మీ క్రెడిట్‌కార్డు రివార్డు పాయింట్ల విలువ తెలుసా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని