పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125 ధర రూ.93,690 - Pulsar NS 125 At 93690
close

Published : 21/04/2021 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125 ధర రూ.93,690

దిల్లీ: బజాజ్‌ ఆటో తమ కొత్త పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125 మోటార్‌సైకిల్‌ను మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.93,690 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). ఈ బైక్‌ 125 సీసీ బీఎస్‌-6 డీటీఎస్‌-ఐ ఇంజిన్‌తో రూపొందిందని, 12 పీఎస్‌ సామర్థ్యం, 11 ఎన్‌ఎమ్‌ గరిష్ఠ టార్క్‌ దీని సొంతమని కంపెనీ తెలిపింది. నైట్రాక్స్‌ మోనో-షాక్‌ అబ్జార్బర్స్‌ ఉండటంతో అధిక వేగంతో వెళ్లినా, స్థిరమైన ప్రయాణ అనుభూతి పొందవచ్చని పేర్కొంది. పల్సర్‌ ఎన్‌ఎస్‌ సిరీస్‌లో ఎన్‌ఎస్‌ 200, ఎన్‌ఎస్‌ 160 మోడళ్లు కూడా ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని