Stock market: సూచీలపై ఆర్‌బీఐ ప్రభావం! - RBI Decision to keep interest rates unchanged has effect on stock indices
close

Updated : 04/06/2021 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: సూచీలపై ఆర్‌బీఐ ప్రభావం!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచనున్నట్లు ప్రకటించడంతో ఉదయం లాభాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. మరోవైపు కొన్ని కీలక రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలను కిందకు దిగజారాయి. చివరకు సెన్సెక్స్‌ 132 పాయింట్ల నష్టంతో 52,100 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 15,670 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.01 వద్ద స్థిరపడింది.

బీఎస్‌ఈ 30 సూచీలో 18 కంపెనీలు నష్టాల్లో ముగియగా.. 12 కంపెనీలు లాభాలు ఒడిసిపట్టాయి. నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌ రిలయన్స్‌ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ఫినాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని