పీపీఐ చెల్లింపుల‌పై ఆర్‌బీఐ ప్ర‌తిపాద‌న‌లు  - RBI Policy-three-changes-to-mobile-wallets
close

Updated : 07/04/2021 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీపీఐ చెల్లింపుల‌పై ఆర్‌బీఐ ప్ర‌తిపాద‌న‌లు 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, బుధవారం జ‌రిగిన 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ప‌ర‌ప‌తి విధాన పాల‌సీని వివరిస్తూ, ప్రీపెయిడ్ చెల్లింపుల వ్య‌వ‌స్థ-పీపీఐ (మొబైల్ వాలెట్లు వంటివి)కు సంబంధించి మూడు సంస్కరణలను ప్రకటించారు. 

సెంట్రల్ బ్యాంక్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్) సిస్టమ్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ (నెఫ్ట్)లను పీపీఐల‌కు వ‌ర్తింప‌చే‌య‌‌నున్న‌ట్లు తెలిపింది. 

కేవైసీ(నో యుర్ క‌స్ట‌మ‌ర్) పూర్తి చేసిన పీపీఐ వినియోగ‌దారులు ఇప్పుడు రూ.2 ల‌క్షల వ‌ర‌కు ఫండ్స్‌ని బ‌దిలీ చేసేందుకు అనుమ‌తించారు. ప్ర‌స్తుతం రూ.1 ల‌క్ష వ‌ర‌కు మాత్ర‌మే బ‌దిలీ చేసేందుకు వీలుంది. ఒక రోజులో రూ. 1ల‌క్ష వ‌ర‌కు మాత్ర‌మే లావాదేవీలు చేయ‌వ‌చ్చ‌ని ప‌రిమితి ఉండేది. ఈ ప‌రిమితిని రూ. 2 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని ఆర్‌బీఐ ప్ర‌తిపాదించింది. 

పీపీఐ అంతర కార్యనిర్వహణ దిశ‌గా కూడా సెంట్ర‌ల్ బ్యాంక్  చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అంటే, వినియోగ‌దారులు ఒక వ్యాలెట్ నుంచి మ‌రొక వ్యాలెట్‌కు, వ్యాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు కేంద్రీకృత చెల్లింపుల వ్య‌వ‌స్థ ద్వారా నిధులు బ‌దిలీ చేసుకోవ‌చ్చు.  

అలాగే, కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 4 శాతం రెపోరేటు, 3.35 శాతం రివర్స్ రెపోరేటు వరుసగా ఐదోసారి యథాతథంగా కొనసాగనున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని