RBI: పాత నోట్ల ప్రకటనలతో జాగ్రత్త: ఆర్బీఐ - RBI cautions against fraudulent offers of buying selling old notes
close

Published : 05/08/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RBI: పాత నోట్ల ప్రకటనలతో జాగ్రత్త: ఆర్బీఐ

ముంబయి: పాత కరెన్సీ నోట్లు, నాణేలు కమీషనుతో విక్రయిస్తామని..కొంటామని అనధికారికంగా చేసే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దంటూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం ఓ ప్రకటనలో ప్రజలను హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు/ సంస్థలు రిజర్వుబ్యాంక్‌ పేరు, లోగోలను సైతం వాడుకొని ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్టు తమదృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ మార్గాల ద్వారా పాత నోట్ల చలామణీ చేస్తూ ప్రజల నుంచి ఛార్జీలు, కమీషన్లు, పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఆర్‌బీఐకి ఇటువంటి వ్యవహారాలతో సంబంధం లేదని, ఇలాంటి చలామణీలకు తమ ప్రతినిధులుగా ఎవరినీ నియమించలేదని స్పష్టం చేశారు 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని