బ్యాంకుల ఏర్పాటుకు 8 దరఖాస్తులు: ఆర్‌బీఐ - RBI receives 8 applications for setting up banks under on tap licensing
close

Published : 16/04/2021 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకుల ఏర్పాటుకు 8 దరఖాస్తులు: ఆర్‌బీఐ

ముంబయి: యూనివర్సల్‌ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులను ‘ఆన్‌ ట్యాప్‌’ లైసెన్సు కింద ఏర్పాటు చేయడానికి చెరో నాలుగు దరఖాస్తులు వచ్చాయని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించింది. యూనివర్సల్‌ బ్యాంకు లైసెన్సుల కోసం యూఏఈ ఎక్స్ఛేంజీ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ది రెపాట్రియేట్స్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (రెప్కో బ్యాంక్‌), సచిన్‌ బన్సల్‌ సంస్థ చైతన్య ఇండియా ఫిన్‌ క్రెడిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పంకజ్‌ వైశ్‌లు దరఖాస్తు చేసుకున్నాయి. చిన్న ఫైనాన్స్‌ బ్యాంకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో విసాఫ్ట్‌ టెక్నాలజీస్, కాలికట్‌ సిటీ సర్వీస్‌ కోపరేటివ్‌ బ్యాంక్, అఖిల్‌ కుమార్‌ గుప్తా, ద్వారా క్షేత్రియ గ్రామీణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఉన్నాయి. ప్రైవేట్‌ రంగంలో యూనివర్సల్‌ బ్యాంకుల లైసెన్సులకు మార్గదర్శకాలను 2016 ఆగస్టులో, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుల లైసెన్సు మార్గదర్శకాలను 2019 డిసెంబరులో ఆర్‌బీఐ జారీ చేసింది.  దరఖాస్తుల మదింపునకు ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ శ్యామలా గోపినాధ్‌ సారథ్యంలో స్టాండింగ్‌ ఎక్స్‌టెర్నల్‌ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఈఏసీ)ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని