ఆ 14 గంటలు.. RTGS సేవలు బంద్‌ - RTGS to remain unavailable for 14hr on Sunday due to technical upgrade
close

Updated : 15/04/2021 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ 14 గంటలు.. RTGS సేవలు బంద్‌

ముంబయి: అధిక మొత్తంలో లావాదేవీల కోసం జరిపే ఆర్‌టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం(ఏప్రిల్‌ 18) మధ్యాహ్నం 2 గంటల వరకు అంటే 14 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గురువారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతోనే ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.

‘‘ఏప్రిల్‌ 17న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఆర్‌టీజీఎస్‌ వ్యవస్థలో సాంకేతికంగా కొత్త మార్పులు చేపడుతున్నాం. అందువల్ల ఏప్రిల్‌ 18న మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. అయితే నెఫ్ట్‌ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి’’ - ట్విటర్‌లో ఆర్‌బీఐ

రూ. 2లక్షలు అంతకంటే పైబడిన లావాదేవీలకు ఆర్‌టీజీఎస్‌ సేవలను ఉపయోగిస్తుంటాం. అయితే, ఇందులోని డిజాస్టర్‌ రికవరీ టైమ్‌ను మెరుగుపర్చేందుకు ఆర్‌టీజీఎస్‌ సాంకేతిక వ్యవస్థలో ఆర్‌బీఐ మార్పులు చేపడుతోంది. గతేడాది డిసెంబరు 14 నుంచి ఆర్‌టీజీఎస్‌ సేవలను ఆర్‌బీఐ 24×7 అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 
మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని