ఈ రైల్‌టెల్ ఐపీఓలో వాటా కేటాయింపు బ్రోకరేజ్‌ల ప్రకారం ఈ రోజు ఖరారయ్యే అవకాశముంది. రైల్‌టెల్ ఐపీఓకు ధరఖాస్తుదారుల కేటాయింపు స్థితిని కెఫిన్ టెక్నాలజీస్ వెబ్సైట్లో చెక్ చేయవచ్చు. ఇది షేర్ల వాటా కేటాయింపులను, రిఫండ్లను నిర్వహిస్తుంది. ఈ వివరాలు బిఎస్ఈ వెబ్సైట్లో కూడా ఉంటాయి. రైల్‌టెల్ షేర్ల జాబితా ఫిబ్రవరి 26న ఉంటుంది.
రైల్‌టెల్ ఐపీఓ ధర షేరుకు 93-94గా ఉంది. ఈ ఐపీఓలో ప్రభుత్వం 27.16% వాటాను విక్రయిస్తోంది.
రైల్‌టెల్ ఐపీఓ 42 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.
రైల్‌టెల్ యొక్క రూ. 819 కోట్ల ఐపీఓ ఫిబ్రవరి 16 - 18 మధ్య తెరిచి ఉంది. ఆఫర్లో ఉన్న షేర్లు 6,11,95,923. ఈ ఆఫర్‌కు 2,59,42,43,370 షేర్లకు బిడ్లు లభించాయి. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల విభాగం నుండి 16 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల నుండి 65.14 రెట్లు, సంస్థేతర పెట్టుబడిదారుల నుండి 73.25 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.
ఈ ఆఫర్ నిర్వహకులుగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ పనిచేశాయి.
ఈ ఐపీఓకు ముందు, రైల్‌టెల్ 14 యాంకర్ పెట్టుబడిదారుల నుండి రూ. 244 కోట్లు సమీకరించింది.
ఈ ఐపీఓ ఇష్యూకు అనేక బ్రోకరేజ్ సంస్థలు కూడా సిఫారసు చేశాయి.
రైల్‌టెల్ తన ఆదాయంలో 66% టెలికాం విభాగం నుండి పొందుతుంది. మిగిలిన భాగం రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల నుండి వస్తుంది. రైల్‌టెల్ సమర్ధవంతంగా పనిచేస్తే భారత్‌లో 5జీ వృద్ధి నుండి ఫైబరైజేషన్ అవసరాల కోణం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది రైల్వేల డిజిటల్ కార్యక్రమాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కోవిడ్-19 టెలికాం పరిశ్రమపై నష్ట ప్రభావం చూపలేదు. వాస్తవానికి డేటా వినియోగం, ఇంటి నుండి పని లాంటి వాటితో ఈ రంగానికి వృద్ధినే కలిగించింది.
రైల్‌టెల్ రుణ రహిత సంస్థ. స్థిరమైన డివిడెండ్లను కూడా చెల్లిస్తుంది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?