రైల్వేల‌కు రూ.1.1 ల‌క్ష‌ల కోట్లు - Railway-Budget-2021
close

Published : 01/02/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైల్వేల‌కు రూ.1.1 ల‌క్ష‌ల కోట్లు

కేంద్ర బడ్జెట్ 2021 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతర్మాన్ భారతీయ రైల్వేలకు 2021-22 ఆర్థిక సంవత్స‌రానికి రూ. 1.1 లక్షల కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా, 1.07 లక్షల కోట్ల రూపాయలను భారత రైల్వేకు  మూలధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ఆమె ప్రకటించారు. సరుకు రవాణా కారిడార్‌లతో రైల్వే , డబ్బు ఆర్జిస్తుందని ఆమె అన్నారు.

భవిష్యత్తులో సరుకు రవాణా కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం చేపడుతుందని  ప్రకటించారు. "రవాణా స‌దుపాయాన్ని రూ. 18,000 కోట్లతో మ‌రింత‌ పెంచడానికి మేము కృషి చేస్తాము" అని తెలిపారు

మెట్రోలైట్, మెట్రోనియో టెక్నాలజీలను టైర్ -2, టైర్ -1 నగరాల్లో ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. 

2023 డిసెంబర్ నాటికి 100 బ్రాడ్ గేజ్ రైలు పట్టాల విద్యుదీకరణ చేప‌ట్ల‌నున్న‌ట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని