Range Rover: రూ.79.87 లక్షలతో కొత్త ‘వెలార్‌’ - Range Rover Velar Takes new comforts with cabin upgrades
close

Published : 16/06/2021 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Range Rover: రూ.79.87 లక్షలతో కొత్త ‘వెలార్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌:  విలాసవంతమైన కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) సరికొత్త వేలార్‌ మోడల్‌ను  భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్ఫోటైన్‌మెంట్‌లో మార్పులు, శక్తిమంతమైన డీజిల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు ధరను రూ.79.87 లక్షలుగా నిర్ణయించారు.

గతంలో ఉన్న వెలార్‌తో పోలిస్తే 2021 మోడల్‌లో అనేక ఫీచర్లను అప్‌డేట్‌ చేశారు. గతంలో కేవలం పెట్రోల్‌ వేరియంట్‌లో మాత్రమే లభించిన ఈ కారు ఈసారి డీజిల్‌ ఇంజిన్‌తోనూ లభించనుంది. దీనికి రూ.84,000 అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2.0 లీటర్‌, 4 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన కొత్తకారు 204 హెచ్‌పీ శక్తిని, 430 ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక పెట్రోల్‌ ఇంజిన్‌ 250 హెచ్‌పీ శక్తి, 430 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. కొత్తగా ఎయిర్‌సస్పెన్షన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అలాగే గతంలో ఉన్న రేర్‌ వ్యూ కెమెరా స్థానంలో 360 డిగ్రీ కెమెరాను తీసుకొచ్చారు. ఇక యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సాంకేతికతతో పాటు 2.5  పీఎం పరిమాణం గల కణాలను ఫిల్టర్‌ చేయగలిగే క్యాబిన్‌ ఎయిర్‌ ఐయొనైజేషన్‌ సిస్టంను ఏర్పాటు చేశారు.

మొట్టమొదటి సారి రేంజ్ రోవర్ వెలార్‌ రూ.78.83 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధర వద్ద 2017 డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019లో మేడ్-ఇన్-ఇండియా వెలార్‌ మోడల్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ధర రూ.72.47 లక్షలకు దిగొచ్చింది. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ ఎస్‌యూవీని మరింత అప్‌డేట్‌ చేసి ధరను తిరిగి రూ.7.4 లక్షలు పెంచింది. ఈ కారు ప్రపంచంలో సాంకేతికపరంగా అత్యంత ఆధునికమైన ఎస్‌యూవీ అని కంపెనీ తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని