close

Published : 21/04/2021 20:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరో కొత్త కంపెనీలో రతన్‌టాటా పెట్టుబడులు

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మెయిలిట్‌ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టారు. దీనికి సంబంధించిన ఆర్థికరపరమైన వివరాలు బయటకు వెల్లడించలేదు. మెయిలిట్‌ దేశవ్యాప్తంగా టాటా గ్రూప్‌తో పాటు ఇతర కార్పొరేట్‌ సంస్థలకు కార్గో, 3పీఎల్‌, మెయిల్‌ రూం మేనేజ్‌మెంట్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌, పోస్టల్‌ సర్వీసులు అందజేస్తుంది. తాజా పెట్టుబడులతో రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 500 మెయిల్‌రూంలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెయిలిట్‌ తెలిపింది. అలాగే పూర్తి స్థాయి యాంత్రీకరణతో రూపొందించిన వేర్‌హౌస్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొంది.

భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్‌ మెయిల్‌రూం సొల్యూషన్స్ (ఐఎల్అండ్ఎంఎస్) ప్లాట్‌ఫాంను నిర్మించడంపై టాటా దృష్టి సారించినట్లు సమాచారం. వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సంస్థలకు కావాల్సిన మెయిల్‌, కొరియర్‌ సేవలను మెరుగైన సామర్థ్యంతో అదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెయిలిట్‌ వర్గాలు తెలిపాయి. మొత్తం వాల్యూ చైన్‌ను ఏకీకృతపరిచి నిరంతరాయ సేవల్ని అందించేందకు కృషి చేస్తామని పేర్కొన్నాయి. తద్వారా లాజిస్టిక్స్, పంపిణీ ఖర్చులను తగ్గిస్తామని తెలిపాయి. మౌలిక వసతులను బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మెయిలిట్‌ ఐఎల్అండ్ఎంఎస్ ద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గి సప్లయ్ చైన్‌ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

అంకుర, సాంకేతికత సంస్థల్ని ప్రోత్సహించేందుకు రతన్‌ టాటా ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పటి వరకు స్నాప్‌డీల్‌, కార్యా, డాగ్‌స్పాట్‌, అర్బన్‌ ల్యాడర్‌, బ్లూస్టోన్‌, కార్‌దేఖో, సబ్‌సే టెక్‌, షియోమీ, ఓలా వంటి ప్రముఖ సంస్థల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని