close

Published : 06/03/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెడ్‌మి స్మార్ట్‌టీవీలూ వస్తున్నాయ్‌

భారత్‌లోకి తీసుకురానున్న షియామీ

దిల్లీ: చైనా సాంకేతిక దిగ్గజం షియోమీ త్వరలో భారత్‌లోకి ‘రెడ్‌మి’ బ్రాండ్‌తో స్మార్ట్‌ టీవీలను తీసుకురానుంది. దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌టీవీ విభాగంలో తన స్థానాన్ని మరింత విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. ‘2018లో కంపెనీ స్మార్ట్‌ టీవీలను తీసుకొచ్చింది. ఆ సమయంలో మొత్తం టీవీ విక్రయాల్లో స్మార్ట్‌ టీవీల వాటా 18 శాతంగానే ఉండేది. ఇపుడు 55 శాతంపైగా చేరింది. ఇప్పటిదాకా 50 లక్షలకు పైగా టీవీలను మేం విక్రయించాం. భారత్‌లో 20 కోట్లకు పైగా ఇళ్లు ఉండగా.. అందులో 17 కోట్ల మందికి టీవీలున్నాయి. అందులోనూ 10 కోట్ల మందికి సీఆర్‌టీ టీవీలు, 7 కోట్ల మందికి ఫ్లాట్‌ మానిటర్‌ టీవీలున్నాయి. అందులో 2 కోట్లు మాత్రమే స్మార్ట్‌ టీవీలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్మార్ట్‌ టీవీలకు భారీ అవకాశాలున్నాయ’ని షియోమీ ఇండియా స్మార్ట్‌ టీవీ విభాగ అధిపతి ఈశ్వర్‌ నీలకంఠన్‌ పేర్కొన్నారు. షియోమీ ప్రస్తుతం రూ.14,499-54,999 ధరల్లో 9 మోడళ్ల టీవీలను విక్రయిస్తోంది.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని