మోసపూరిత రుణ ఖాతాగా రిలయన్స్‌ హోమ్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ - Reliance Home Reliance Commercial as fraudulent loan account
close

Published : 20/06/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోసపూరిత రుణ ఖాతాగా రిలయన్స్‌ హోమ్‌, రిలయన్స్‌ కమర్షియల్‌

ప్రకటించిన కర్ణాటక బ్యాంక్‌

దిల్లీ: రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌కు కలిపి ఇచ్చిన రూ.160 కోట్లకు పైగా రుణ ఖాతాను మోసపూరితంగా కర్ణాటక బ్యాంక్‌ ప్రకటించింది. కర్ణాటక బ్యాంక్‌కు రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ రూ.21.94 కోట్లు, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ రూ.138.41 కోట్లు బకాయిపడ్డాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఈ ఖాతాలను మోసపూరితంగా ప్రకటించింది. రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌తో 2015, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌తో 2014 నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు కర్ణాటక బ్యాంక్‌ తెలిపింది. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌కు 24 రుణదాతలతో కలిపి, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌కు 22 రుణదాతలతో కలిపి రుణాలను ఇచ్చింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని