Reliance: రూ.16.9 లక్షల కోట్లను తాకిన రిలయన్స్‌ మార్కెట్‌ విలువ - Reliance Industries shares hit record high
close

Published : 27/09/2021 18:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Reliance: రూ.16.9 లక్షల కోట్లను తాకిన రిలయన్స్‌ మార్కెట్‌ విలువ

ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర నేడు రికార్డు స్థాయికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.16.9లక్షల కోట్లను తాకింది. ఉదయం 9.44 సమయంలో రిలయన్స్‌ షేరు  జీవితకాల అత్యధికం రూ.2,510ని తాకింది. దాదాపు ఏడాది నుంచి ఈ కంపెనీ షేరు వరుసగా పెరుగుతూ వస్తోంది. దాదాపు ఏడాది కాలంలో ఈ కంపెనీ షేరు 25శాతం విలువ పెంచుకొంది.

రిలయన్స్‌ జియో డిజిటల్‌ ఎకో సిస్టమ్‌లో తిరుగులేని శక్తిగా ఎదగడం, రిలయన్స్ రిటైల్‌ వేగంగా నెట్‌వర్క్‌ను విస్తరించడం వంటి కారణాలతో షేరు ధర పెరుగుతోంది. కంపెనీ షేర్‌కు డిమాండ్‌ ఎక్కువై ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ కూడా పెరిగాయి. దీంతోపాటు కరోనా సమయంలో కూడా రిలయన్స్‌ విస్తరణ ఎక్కడా ఆగలేదు. వివిధ రంగాల్లోని కంపెనీలను కొనుగోలు చేస్తోంది. ఇటీవల గ్రీన్‌ ఎనర్జీ సెక్టార్‌లోకి కూడా అడుగుపెట్టింది. 

ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సాధారణ స్థాయికి వస్తుండటంతో రీటైల్‌, చమురు వ్యాపారం మళ్ల భారీగా పుంజుకోనుందనే నివేదికలు కొనుగోలుదార్లను ఉత్సాహపరుస్తోంది. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని