Reliance Jio: వారికి అదిరే ఆఫర్‌.. ఒకటి కొంటే మరొకటి ఉచితం! - Reliance Jio is offering Buy 1 Get 1 Free offer
close

Published : 01/08/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Reliance Jio: వారికి అదిరే ఆఫర్‌.. ఒకటి కొంటే మరొకటి ఉచితం!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో మరో సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా జియో ఫోన్‌ వినియోగిస్తున్న వారికి ఇది బంపర్‌ ఆఫర్‌ అని చెప్పవచ్చు. తాజా ఆఫర్‌ కింద రెండింతల ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో రీఛార్జ్‌ ప్లాన్‌ తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశమని జియో తెలిపింది.

జియోఫోన్‌ వినియోగించే వారికి ఆరు రకాల ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై ఈ ప్రయోజనాలు అందుతాయి. ఉదాహరణకు జియో ఫోన్‌ను రూ.75తో రీఛార్జ్‌ చేసుకుంటే అంతే మొత్తంలో అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. .39, .69, .75, .125, .155, .185 రీఛార్జ్‌ ప్లాన్‌పై ఇది వర్తిస్తుంది. అంటే మీరు .39తో రీఛార్జ్‌ చేసుకుంటే అపరిమిత వాయిస్‌ కాల్స్‌ రోజుకు 100ఎంబీ ఉచిత డేటా పొందు తారు. దీని కాల పరిమితి 14రోజులు. ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభించవు. తాజా ఆఫర్‌లో 200ఎంబీ డేటాను పొందవచ్చు.

* .69 ప్లాన్‌ తీసుకుంటే రోజుకు 0.5జీబీ డేటా వస్తుండగా అది 1జీబీ అవుతుంది.

* .75 ప్లాన్‌తో అపరిమిత వాయిస్‌ కాల్స్‌ 3జీబీ డేటాను 28రోజులు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు 6జీబీ డేటా లభిస్తుంది.

* .125 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై రోజుకు 0.5జీబీ డేటా 28 రోజుల పాటు లభిస్తుండగా 1జీబీ డేటాను పొందవచ్చు

* .155ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై అపరిమిత కాల్స్‌ 1జీబీ డేటా లభిస్తుండగా ఇక నుంచి రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది

* .185 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై ఉచిత వాయిస్‌ కాల్స్‌ 2జీబీ డేటా లభిస్తుండగా ఇక నుంచి 4జీబీ డేటా పొందవచ్చు.

ఈ ప్లాన్‌లతో అపరిమిత డేటా

ఇక జియో ‘నో డేటా లిమిట్‌’ పేరుతో అపరిమిత డేటాను వినియోగించుకునే సౌలభ్యం కల్పిస్తోంది. సాధారణంగా ఏదైనా ప్లాన్‌ తీసుకుంటే డేటా వినియోగంలో పరిమితి ఉంటుంది. తీసుకునే ప్లాన్‌ను బట్టి 1జీబీ, 2జీబీ, 3జీబీ ఇలా వినియోగించుకోవచ్చు. ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌లతో రీఛార్జ్‌ చేసుకుంటే పూర్తి డేటా అయిపోయే వరకూ వాడుకోవచ్చు. .127తో రీఛార్జ్‌ చేసుకుంటే 15 రోజుల కాలపరిమితితో 12జీబీ డేటా లభిస్తుంది. దీన్ని ఒకేరోజులో కూడా వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. అలా .247 ప్లాన్‌పై 25జీబీ(30రోజులు) .447తో 50జీబీ(60 రోజులు), .597తో 75జీబీ(90రోజులు), .2397తో 365జీబీ(365రోజులు) ఈ ఫ్రీడమ్‌ ప్యాక్స్‌ అందుబాటులో ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని