రాబ‌డిపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే మూడు అంశాలు - Reverse-compounding-effect-on-finances
close

Published : 22/01/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాబ‌డిపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే మూడు అంశాలు

పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే ఆదాయంపై చ‌క్ర‌వ‌డ్డీ ద్వారా వ‌చ్చే రాబ‌డి గురించి తెలిసే ఉంటుంది. మ‌రి కొన్ని సార్లు అదే చ‌క్ర‌వ‌డ్డీ మ‌నం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సంపాదించిన డ‌బ్బు ఆవిరైపోతుంది. మ‌రి ఎటువంటి సంద‌ర్భాల్లో మ‌నం తిరిగి చ‌క్ర‌వ‌డ్డీ రూపంలో చెల్లించాలో తెలుసుకుందాం

రుణాల‌పై వ‌డ్డీ చెల్లింపులు:
వ‌డ్డీపై చ‌క్ర‌వ‌డ్డీ ల‌భిస్తే రాబ‌డి మ‌రింత పెరుగుతుంది. పెట్టుబ‌డుల విష‌యంలో , మీరు ఇప్పటికే సంపాదించిన వడ్డీ ఆదాయాన్ని ఎక్కువ రాబడిని సంపాదించడానికి కొన‌సాగించ‌డం ద్వారా ఈ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అయితే రుణాల‌పై వ‌డ్డీ చెల్లిస్తున్న‌ప్పుడు ఇదే సూత్రం మీపై ప్ర‌భావం చూపిస్తుంది.

ఈఎమ్ఐ త‌గ్గించుకునేందుకు ఎక్కువ కాల‌ప‌రిమితో రుణాల‌ను తీసుకుంటే ఎక్కువ వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. స‌మ‌యానికి చెల్లింపులు చేయ‌క‌పోతే, ఆ వ‌డ్డీతో పాటు దానిపై వ‌డ్డీ కూడా వ‌ర్తిస్తుంది. క్రెడిట్ కార్డు రుణాల‌పై లేదా ఈఎమ్ఐ చెల్లించ‌న‌ప్పుడు ఈ విధమైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

చాలామందికి క్రెడిట్ కార్డు బిల్లు స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే ఎక్కువ వ‌డ్డీ ప‌డుతుంద‌ని తెలుసు. కానీ ఈఎమ్ఐల విష‌యానికొస్తే ఎక్కువ కాలం కాల‌ప‌రిమితితో త‌క్కువ చెల్లించేందుకే చూస్తారు. ఎక్కువ వ‌డ్డీ ప‌డుతుంద‌న్న విష‌యం గురించి ఆలోచించరని ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ‌డ్డీ రేటును బ‌ట్టి చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. క్రెడిట్ కార్డుల‌తో రోజువారిగా లెక్కిస్తారు దీంతో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ద్ర‌వ్యోల్బ‌ణం:
సంపాదించిన డ‌బ్బును ద్ర‌వ్యోల్బ‌ణం ఆవిరి చేస్తుంది. ఇప్పుడు వెయ్యి రూపాయ‌ల‌కు ఉన్న‌ విలువ వ‌చ్చే రోజుల్లో ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా త‌గ్గుతుంది. ఇప్పుడు ఒక వెయ్యి రూపాల‌య‌తో కొనుగోలు చేయ‌గలిగే ఒక వ‌స్తువు కొన్ని రోజుల త‌ర్వాత కొనుగోలు చేయ‌లేం. ఎందుకంటే ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా ధ‌ర పెరుగుతుంది. ఒక వ‌స్తువుకు ఇప్పుడు చెల్లించే డ‌బ్బు, 15 ఏళ్ల త‌ర్వాత 5 శాతం ద్ర‌వ్యోల్బ‌ణం ఉంటే 107 శాతం ఎక్కువ‌గా చెల్లించాలి. ద్ర‌వ్యోల్బ‌ణం అదిగ‌మించే ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తే రాబ‌డిని కాపాడుకోవ‌చ్చు.

పెట్టుబ‌డుల వ్య‌యాలు:
ఎక్కువ వ్య‌యాలు, ఫీజులు లేదా ప‌న్నులు పెట్టుబ‌డుల‌పై పెరిగిన‌ప్పుడు వ‌చ్చే ఆదాయంపై ప్ర‌భావం చూపుతుంది. దీంతో రాబ‌డి త‌గ్గుతుంది… ముఖ్యంగా దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల్లో వ్య‌యాలు పెరిగితే రాబ‌డి త‌గ్గుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు పెట్టుబ‌డుల‌పై వార్షిక వ్య‌యం 2 శాతం, 15 సంవ‌త్స‌రాల‌కు చెల్లిస్తే వ‌చ్చే రాబ‌డిలో 12 శాతం త‌గ్గుతుంది. పెట్టుబ‌డులు ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించే విధంగా ఉండాలి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో క్ర‌మానుగ‌తంగా ప‌న్ను చెల్లింపుతో రాబ‌డి త‌గ్గుతూ వ‌స్తుంది

చివ‌ర‌గా…
ఆర్థిక విష‌యాల‌పై ముఖ్యంగా ప్ర‌భావం చూపించేది స‌మ‌యం. రుణ చెల్లింపులు దీర్ఘ‌కాలం చేస్తే అంత ఎక్కువ‌గా కోల్పోతారు. అందుకే స్వ‌ల్పకాలిక రుణాల‌ను తీసుకొని స‌మ‌యానికి చెల్లించండి. ఎక్కువ వ‌డ్డీ భారం ప‌డ‌కుండా ఉండాలంటే ముంద‌స్తు చెల్లింపుల‌ను ప‌రిశీలించండి. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదిగ‌మించే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోండి. ప‌న్నులు, వ్య‌యాలు త‌క్కువ‌గా ఉండి, ప‌న్ను మిన‌హాయింపులు లేదా విత్‌డ్రా స‌మ‌యంలో మాత్ర‌మే వ‌ర్తించే విధంగా పెట్టుబ‌డులు ఉండాలి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని