ఎయిర్‌టెల్‌ మొబైల్‌ కామర్స్‌లో రైజ్‌ ఫండ్‌ రూ.1450 కోట్ల పెట్టుబడి - Rise Fund invests Rs 1450 crore in Airtel Mobile Commerce
close

Published : 19/03/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిర్‌టెల్‌ మొబైల్‌ కామర్స్‌లో రైజ్‌ ఫండ్‌ రూ.1450 కోట్ల పెట్టుబడి

దిల్లీ: ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకు చెందిన మొబైల్‌ మనీ వ్యాపార సంస్థ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ కామర్స్‌ (ఏఎంసీ) బీవీలో టీపీజీకి చెందిన రైజ్‌ ఫండ్‌ 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,450 కోట్లు) పెట్టుబడిగా పెట్టనుంది. ఏఎంసీ విలువను 2.65 బిలియన్‌ డాలర్లుగా లెక్కలోకి తీసుకుంటే ఈ లావాదేవీ అనంతరం ఏఎంసీలో రైజ్‌ ఫండ్‌కు 7.5 శాతం వాటా లభించే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకు చెందిన వివిధ మొబైల్‌ మనీ కార్యకలాపాలకు ఎయిర్‌టెల్‌ మొబైల్‌ కామర్స్‌ ప్రస్తుతం హోల్డింగ్‌ కంపెనీగా ఉంది. ఏఎంసీలోని షేర్లను ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా నుంచి కొనుగోలు చేయడం ద్వారా రైజ్‌ ఫండ్‌ 200 మిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెడుతుందని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దశల్లో ఈ లావాదేవీ పూర్తవుతుందని పేర్కొంది. ఈ లావాదేవీ ద్వారా సమీకరించిన నిధులను రుణాలు చెల్లించేందుకు, వివిధ దేశాల్లో నెట్‌వర్క్‌, విక్రయ కేంద్రాలపై పెట్టుబడులు పెట్టేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది.

భారత్‌లోకి సిగ్నిఫై 3డీ లైట్లు

దిల్లీ: సిగ్నిఫై ఇన్నోవేషన్స్‌ ఇండియా(పాత పేరు ఫిలిప్స్‌ లైటింగ్‌ ఇండియా) దేశంలోకి తొలిసారిగా కస్టమైజ్డ్‌ 3డీ ప్రింటెడ్‌ లైట్లను ఆవిష్కరించింది. వీటిని పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవచ్చని తెలిపింది. వడోదరలోని ప్రస్తుత ఫ్యాక్టరీలో ఒక 3డీ ప్రింటింగ్‌ తయారీ ప్లాంటును; నోయిడాలోని ఆర్‌ అండ్‌ డీ కేంద్రంలో మరో ప్రింటింగ్‌ ప్లాంటును ఇందు కోసం ఏర్పాటు చేసింది. వినియోగదార్ల అవసరాలకు తగ్గట్లుగా (కస్టమైజ్డ్‌) డిజైన్లను తయారు చేసి లూమినరీజ్‌ను సిద్ధం చేస్తారు. ‘దేశంలోకి 3డీ ప్రింటెడ్‌ లూమినరీజ్‌ను తొలిసారిగా తయారు చేస్తున్నందుకు గర్వంగా ఉంద’ని సిగ్నిఫై ఇన్నోవేషన్స్‌ ఇండియా వైస్‌ప్రెసిడెంట్‌, ఎండీ, సుమిత్‌ జోషి పేర్కొన్నారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని