త్వ‌ర‌లో ప్రారంభం కానున్న `రోలెక్స్ రింగ్స్‌` ఐపీఓ - Rolex-Rings-IPO-to-open- for-subscription-this-week
close

Published : 26/07/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న `రోలెక్స్ రింగ్స్‌` ఐపీఓ

`రోలెక్స్ రింగ్స్` ఐపీఓ ఈ వారం చందా కోసం తెర‌వ‌బ‌డుతుంది. గుజ‌రాత్ కేంద్రంగా ఉన్న రోలెక్స్ రింగ్స్ పోర్జ్‌డ్ , యంత్ర భాగాల త‌యారీలో ప్ర‌ముఖ‌మైన కంపెనీ. ఆటో-విడిభాగాల త‌యారీదారు రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ ప్రారంభ ప‌బ్లిక్ ఆఫ‌రింగ్ (ఐపీఓ) ఈ బుధ‌వారం జులై 28 మొద‌లై జులై 30తో ముగుస్తుంది. ఈ సంస్థ ప్రారంభ ధ‌ర అమ్మ‌కం కోసం  రూ. 880-900 వ‌ద్ద ధ‌ర‌ను నిర్ణ‌యించింది. ఈ ఇష్యూలో రూ. 56 కోట్లు, `రివెండెల్ పీఇ`చే రూ. 750 కోట్లు ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ ఉన్నాయి. `రివెండెల్ పీఈ` గ‌తంలో న్యూసిల్క్ రూట్ -పీఈ మారిష‌స్ అని పిలిచేవారు. ప్ర‌స్తుతం `రివెండెల్‌`కు రోలెక్స్ రింగ్స్‌లో 41% వాటాను క‌లిగి ఉంది.

మార్కెట్ ప‌రిశీల‌కుల ప్ర‌కారం, `రోలెక్స్ రింగ్స్` గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) సుమారు రూ. 530 వ‌ద్ద ఉంది. గ్రే మార్కెట్ అన‌ధికారిక వేదిక‌. దీనిలో ఐపీఓ ధ‌ర‌లు ప్ర‌క‌టించిన త‌ర్వాత ఐపీఓ వాటాల లిస్టింగ్‌ వ‌ర‌కు ట్రేడింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ఐపీఓ ద్వారా వ‌చ్చే ఆదాయం దీర్ఘ‌కాలిక ప‌నుల మూల‌ధ‌న అవ‌స‌రాల‌కు, సాధార‌ణ కార్పొరేట్ ప్ర‌యోజ‌నాల‌కు నిధులు స‌మ‌కూర్చ‌డానికి ఉప‌యోగించ‌బ‌డుతుంది. ఈక్విర‌స్ క్యాపిట‌ల్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఐడీబీఐ క్యాపిట‌ల్ మార్కెట్స్ అండ్ సెక్యూరీటీస్ లిమిటెడ్‌, జేఎమ్ ఫైనాన్షియ‌ల్ లిమిటెడ్ ఈ ఇష్యూకు మ‌ర్చంట్ బ్యాంక‌ర్లుగా నియ‌మించ‌బ‌డ్డాయి. సంస్థ ఈక్విటీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)తో పాటు నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎన్ఈ)లో లిస్టింగ్ చేయ‌బ‌డ‌తాయి.

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్ కేంద్రంగా, రోలెక్స్ రింగ్స్ దేశంలో పోర్జ్‌డ్‌, యంత్ర భాగాల త‌యారీలో గుర్తించ‌ద‌గిన పేరొందిన కంపెనీ. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రంలో కంపెనీ లాభం రూ. 52.94 కోట్లుగా ఉంది. ఇంత‌కుముందు ఆర్థిక సంవ‌త్స‌రంలో కంపెనీ ఆర్జ‌న రూ. 59.04 కోట్లు. కార్య‌క‌లాపాల ద్వారా కంపెనీ గ‌రిష్ట ఆదాయం రూ. 666 కోట్లు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని