రెండేళ్లుగా ప్రింట్‌ అవ్వని ₹2000! - Rs 2000 notes not printed in last 2 years: Govt in Lok Sabha
close

Updated : 15/03/2021 17:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండేళ్లుగా ప్రింట్‌ అవ్వని ₹2000!

దిల్లీ: నోట్ల రద్దు తర్వాత తొలిసారి వెలుగులోకి వచ్చిన రెండు వేల రూపాయిల నోటు.. గత రెండేళ్లుగా ప్రింటింగ్‌కు నోచుకోలేదట. వీటి సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభలో తెలియజేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్‌ నుంచి ఒక్క నోటు కూడా ముద్రణ జరగలేదని తెలిపారు.

2018 మార్చి 30 నాటికి 3,362 మిలియన్ల రెండు వేల రూపాయల నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయని ఠాకూర్‌ తెలిపారు. సంఖ్యాపరంగా మొత్తం నోట్లలో వీటి వాటా 3.27 శాతం కాగా.. విలువ పరంగా 37.26 శాతంతో సమానమని తెలిపారు. 2021 ఫిబ్రవరి 26 నాటికి 2,499 మిలియన్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయని చెప్పారు. సంఖ్యా పరంగా ఈ వాటా 2.01 శాతం కాగా.. విలువ పరంగా 17.78 శాతమని తెలిపారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్‌బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఠాకూర్‌ తెలిపారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల రూపాయిల ముద్రణకు సంబంధించి ప్రింటింగ్‌ ప్రెస్‌కు ఎలాంటి ఇండెంట్‌ వెళ్లలేదని చెప్పారు.

ఇవీ చదవండి..

15,000 దిగువకు నిఫ్టీ

వరుసగా రెండో నెలా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని