శాట్‌లో ఫ్యూచర్‌ ‌గ్రూప్‌నకు ఊరట - SAT stays Sebi order accusing Future Group promoters of insider trading
close

Updated : 16/02/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శాట్‌లో ఫ్యూచర్‌ ‌గ్రూప్‌నకు ఊరట

 సెబీ ఆదేశాలపై స్టే

ఇంటర్నెట్‌డెస్క్‌: సెక్యూరిటీ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌(శాట్‌)లో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు ఊరట లభించింది. ఆ గ్రూప్‌ వ్యవస్థాపకులు కిశోర్‌ బియానీ, ఆయన సోదరుడు అనిల్‌ బియానీ, ఫ్యూచర్‌  కార్పొరేట్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్ సంస్థలు సెక్యూరిటీ మార్కెట్లకు ఏడాది పాటు దూరంగా ఉండాలని ఫిబ్రవరి 3వ తేదీన ఆదేశించింది.  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిర్వహించినట్లు వీరిపై ఆరోపణలు రావడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకొంది. దీంతోపాటు ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ షేర్ల క్రయవిక్రయాలు రెండేళ్లపాటు చేయకూడదని వీరిని ఆదేశించింది. దీంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ శాట్‌ను ఆశ్రయించింది.

ఫిబ్రవరి 15న దీనిపై వాదనలు జరిగాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ తరపున సోమశేఖర్ ‌సుందరేశన్‌ వాదనలు వినిపించారు. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ 2017 ఏప్రిల్‌లో జరిగిందని.. షేర్ల కొనుగోలు మార్చిలో జరిగిందని శాట్‌కు వివరించారు. సంస్థ హోం ఫర్నిషింగ్‌ వ్యాపారం పునర్‌వ్యవస్థీకరణ అంశం 2016 నుంచి ప్రజలకు తెలిసిందేనని వివరించింది.  శాట్‌ దీనిపై స్పందిస్తూ సెబీ ఆదేశాలపై స్టే విధించింది. దీంతోపాటు ఫ్యూచర్‌ గ్రూప్‌ రూ.11 కోట్లను డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఈ కేసును ఏప్రిల్‌ 12వ తేదీన విచారించనుంది.

ఈ కంపెనీకి చెందిన కొన్ని వ్యాపారాల విభజనకు సంబంధించి, ధరలపై ప్రభావం చూపే అప్రచురిత సమాచారం ఆధారంగా మార్చి 10, 2017 నుంచి ఏప్రిల్‌ 20, 2017 మధ్య కొంత మంది వ్యక్తులు, సంస్థలు ట్రేడింగ్‌ జరిపారా లేదా అనే విషయమై సెబీ దర్యాప్తు చేపట్టింది. వీరు ట్రేడింగ్‌ జరిపి చట్టవ్యతిరేకంగా లాభాలు పొందినట్లు  తేలడంతో తాజా చర్యలు చేపట్టింది. 

ఇవీ చదవండి

అమెజాన్‌ 4 కోట్ల డాలర్లు అడిగింది


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని