రూ.5 ల‌క్ష‌ల డిపాజిట్‌తో నెల‌కు రూ.10,000 ఆదాయం   - SBI-Annuity-seposit-scheme
close

Updated : 16/02/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 రూ.5 ల‌క్ష‌ల డిపాజిట్‌తో నెల‌కు రూ.10,000 ఆదాయం 

ప్రజలు తమ భవిష్యత్తు కోసం వేర్వేరు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. కానీ, కొన్నిసార్లు పెట్టుబ‌డుల విష‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోతే  ప్రయోజనాలకు బదులుగా సమస్యలు ఏర్పడతాయి. అందుకే దీనికోసం స‌రైన స్కీముల‌ను ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం. అయితే దీనికోసం ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కంలో డిపాజిట్ చేస్తే కొంత‌కాలం త‌ర్వాత క్ర‌మంగా ఆదాయం పొంద‌వ‌చ్చు.

ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్

ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో  36, 60, 84 లేదా 120 నెలల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. ఎంత కాల‌ప‌రిమితి ఎంచుకున్నా పెట్టుబడిపై వడ్డీ రేటు ఒకే విధంగా ఉంటుంది. మీరు ఐదేళ్లపాటు ఫండ్ డిపాజిట్  చేస్తే, అప్పుడు మీకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటు ప్రకారం మాత్రమే వడ్డీ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

రూ.10,000 నెలవారీ ఆదాయం

ఒక పెట్టుబడిదారుడు ప్రతి నెలా రూ.10,000 ఆదాయాన్ని కోరుకుంటే,  రూ .5,07,964 జమ చేయాలి. జమ చేసిన మొత్తంపై  7 శాతం వడ్డీ రేటు నుంచి రాబడిని పొందుతారు, ఇది ప్రతి నెలా సుమారు రూ. 10,000 వ‌స్తుంది. మీరు  రూ .5 లక్షలకు పైగా పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే,  భవిష్యత్తులో మీ ఆదాయాన్ని మ‌రింత  పెంచుకోవాలనుకుంటే, ఇది మంచి ఎంపిక.

పెట్టుబ‌డి నియ‌మాలు

ప్రతి నెలా కనీసం రూ. 1,000 ఎస్‌బీఐ యాన్యుటీ పథకంలో జమ చేయవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. నిర్దిష్ట సమయం తర్వాత  జమ చేసిన మొత్తంపై వ‌డ్డీ ప్రారంభమవుతుంది. ఈ పథకం భవిష్యత్తులో క్ర‌మంగా ఆదాయం పొందాల‌నుకునేవారి కోసం చాలా మంచి ప‌థ‌కం అని చెప్ప‌వ‌చ్చు. అయితే మధ్యతరగతి వారి ద‌గ్గ‌ర ఒకేసారి ఇంత డ‌బ్బు ఉండ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి వారికి దీని ప్ర‌యోజ‌నాలు అందుకోవ‌డం క‌ష్టం కావొచ్చు.

రిక‌రింగ్ డిపాజిట్‌

పెట్టుబ‌డికోసం పెద్ద‌మొత్తంలో డ‌బ్బు లేనివారికి రిక‌రింగ్ డిపాజిట్ అనువైన‌ది. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కోసం చిన్న మొత్తంలో ప్ర‌తి నెల ఇందులో డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఆర్‌డీలో చిన్న పొదుపుల ద్వారా ఈ మొత్తాన్ని సేకరించి, దానిపై వడ్డీని వర్తింపజేయడం ద్వారా మంచి రాబ‌డిని అందిస్తుంది.  సామాన్య ప్రజల‌కు ఇది అనుకూలంగా ఉంటుంది.

ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్ గురించి మ‌రిన్ని విష‌యాలు

* మీరు ఎంచుకున్నంత గ‌డువు వ‌ర‌కు డిపాజిట్ చేసిన త‌ర్వాత అప్ప‌టినుంచి వ‌డ్డీతోపాటు కొంత అస‌లు క‌లిపి నెల‌వారీగా క్ర‌మ‌మైన ఆదాయాన్ని అందిస్తుంది.

* క‌నీస గ‌డువు 36 నెల‌లు లేదా మూడు సంవ‌త్స‌రాలు అంటే నెల‌కు క‌నీసం రూ.1000 డిపాజిట్ చేయాలి. అప్పుడు మొత్తం డిపాజిట్ రూ.36,000 అవుతుంది.  గ‌రిష్ఠ ప‌రిమితి ఏమిలేదు.

* ఎస్‌బీఐ ఉద్యోగుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు వ‌డ్డీ రేటు ఒక‌టి శాతం ఎక్కువ‌గా ఉంటుంది

* 60 ఏళ్లు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న సీనియ‌ర్ సిటిజ‌న్లకు 0.05 శాతం అధిక వ‌డ్డీ ల‌భిస్తుంది.

* ప్ర‌తి నెల మీ పొదుపు ఖాతాలోకి ఇది జ‌మ అవుతుంది.

* నామినీ స‌దుపాయం ఉంది

* ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో డిపాజిట్‌పై 75 శాతం వ‌ర‌కు రుణం పొందే అవ‌కాశం ఉంది. అయితే రుణం తీసుకున్న త‌ర్వాత ప్ర‌తి నెల దీనిపై వ‌చ్చే ఆదాయం రుణ ఖాతాలోకి వెళ్తుంది.

* పాస్‌బుక్ జారీ చేస్తుంది. ఒక బ్యాంకు శాఖ నుంచి మ‌రో శాఖ‌కు ఈ ఖాతాను బ‌దిలీ చేయ‌వ‌చ్చు.

* ఒక‌రు లేదా  ఉమ్మ‌డిగా కూడా ఖాతా ప్రారంభించ‌వ‌చ్చు.

* భార‌త్‌లో నివ‌సిస్తున్న‌వారు ఎవ‌రైనా, మైన‌ర్లు కూడా ఈ ఖాతా ప్రారంభించ‌వ‌చ్చు.

* డిపాజిట‌ర్ మ‌ర‌ణిస్తే ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చు. దీనికి ఛార్జీలు వ‌ర్తిస్తాయి. రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ల‌పై మాత్ర‌మే ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ ల‌భిస్తుంది.

* ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌పై ల‌భించిన వ‌డ్డీపై టీడీఎస్ వ‌ర్తిస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని