SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక - SBI Imp alert to its customers
close

Updated : 16/07/2021 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక

ఈరోజు ఈ వేళల్లో ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం

దిల్లీ: మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే, బ్యాంకు మీకు ఓ ముఖ్య గమనిక జారీ చేసింది. కష్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించి పలు సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈరోజు(జులై 16) అర్ధరాత్రి సమయంలో రెండున్నర గంటల పాటు సేవలు నిలిచిపోతాయని తెలిపింది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎటువంటి మెసేజ్‌లు, అలర్ట్‌లపై క్లిక్‌ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆ సమయంలో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. కష్టమర్లంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఏ సమయంలో?  ఏయే సేవలు?

జూన్‌ 16 రాత్రి 10:45 గంటల నుంచి జులై 17 వేకువజామున 1:15 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి. మొత్తం రెండున్నర గంటల పాటు సేవలు ఆగిపోనున్నాయి. 

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనోలైట్‌, యూపీఐ సేవలకు అంతరాయం కలగనుంది.



మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని