వ‌డ్డీ రేట్లు పెంపుతో `ఎస్‌బీఐ ప్లాటిన‌మ్‌`, `హెచ్‌డీఎఫ్‌సీ గ్రీన్‌` ఫిక్స్‌డ్ డిపాజిట్లు - SBI-Platinum-deposits-vs-HDFC-Green-deposits
close

Published : 24/08/2021 13:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ‌డ్డీ రేట్లు పెంపుతో `ఎస్‌బీఐ ప్లాటిన‌మ్‌`, `హెచ్‌డీఎఫ్‌సీ గ్రీన్‌` ఫిక్స్‌డ్ డిపాజిట్లు

గ‌త‌వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ల‌ను ప్రారంభించాయి. ప్ర‌భుత్వ రంగంలోని ఎస్‌బీఐ పేరున్న పెద్ద బ్యాంక్ అవ్వ‌డం, ప్రైవేట్ రంగంలోని పేరున్న బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఈ డిపాజిట్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం క‌స్ట‌మ‌ర్ల‌ను డిపాజిట్ల‌ప‌రంగా బాగా ఆక‌ర్షించే విష‌య‌మే. ఎస్‌బీఐ ప్లాటినం డిపాజిట్ల‌ను, హెచ్‌డీఎఫ్‌సీ గ్రీన్ డిపాజిట్ల‌ను కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టాయి.

ఎస్‌బీఐ ప్లాటినం డిపాజిట్లుః స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75 సంవ‌త్స‌రాల స్వాతంత్య్ర వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ప్లాటినం డిపాజిట్ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ ప్లాటినం డిపాజిట్ ప‌థ‌కం కింద క‌స్ట‌మ‌ర్లు 75 రోజులు, 75 వారాలు, 75 నెల‌ల గ‌డువున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను తీసుకోవ‌చ్చు. ఈ డిపాజిట్లు తీసుకోవ‌డానికి  ఈ ఆగ‌స్టు 15 నుండి ఈ సెప్టెంబ‌ర్ 14 వ‌ర‌కు గ‌డువుంది.

2250 రోజుల ప్లాటినం డిపాజిట్ః
ఎస్‌బీఐ `వియ్‌కేర్` ప‌థ‌కం కింద వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.20%గా ఉంది.
సీనియ‌ర్ సిటిజ‌న్లు, ఎస్‌బీఐ పెన్ష‌న‌ర్లు `ఎస్‌బీఐ వియ్‌కేర్‌` స్కీమ్ కింద 5 సంవ‌త్స‌రాలు, అంత‌కు మించిన కాల‌ప‌రిమితికి ప్ర‌యోజ‌నాల‌ను పొందుతారు. ప్లాటినం డిపాజిట్ల కింద అద‌న‌పు ప్ర‌యోజ‌నం అందుబాటులో లేదు.

అర్హ‌తః

  • `ఎన్ఆర్ఈ`, `ఎన్ఆర్ఓ` డిపాజిట్ల‌కు, రూ. 2 కోట్ల క‌న్నా త‌క్కువ డిపాజిట్ల‌కు ఈ వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి
  • కొత్త, రెన్యువ‌ల్ డిపాజిట్ల‌కు కూడా వ‌ర్తిస్తాయి.
  • `ఎన్ఆర్ఈ` డిపాజిట్లు 525, 2250 రోజుల‌కు మాత్ర‌మే.

`హెచ్‌డీఎఫ్‌సీ గ్రీన్ డిపాజిట్లు` హౌసింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌) వాతావ‌ర‌ణ మార్పుల నుండి ప‌ర్వావ‌ర‌ణాన్ని కాపాడే ల‌క్ష్యంతో త‌న `గ్రీన్ అండ్ స‌స్టైన‌బుల్‌` డిపాజిట్‌ల‌ను ప్రారంభించింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప‌ర్యావ‌ర‌ణ‌, స్థిర‌మైన హౌసింగ్ క్రెడిట్ పొల్యూష‌న్స్‌, సేవ‌ల ఫైనాన్సింగ్ వైపు మ‌ళ్లించ‌బ‌డ‌తాయి.

ఎవ‌రైనా భార‌తీయ వ్య‌క్తి.. నివాసి అయినా, నాన్‌-రెసిడెంట్ అయినా ఈ డిపాజిట్‌ల‌ను చేయ‌డానికి అర్హులు. ఈ డిపాజిట్ల వ్య‌వ‌ధి 36 నెల‌ల నుండి 120 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. డిపాజిట్‌ల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం 6.55% వ‌ర‌కు వ‌డ్డీ రేట్లు ల‌భిస్తాయి. సీనియ‌ర్ సిటిజ‌న్లు (60 ఏళ్లు పైబ‌డిన‌వారు) రూ. 2 కోట్ల వ‌ర‌కు ఉన్న‌ డిపాజిట్ల‌పై అద‌నంగా 0.25% వార్షిక వ‌డ్డీకి అర్హులు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని