ఎస్‌బీఐ.. పోస్టాఫీస్.. రిక‌రింగ్‌ డిపాజిట్‌.. ఏది మేలు? - SBI-Post-Office-recurring-deposits-Latest-interest-rates
close

Published : 25/01/2021 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ.. పోస్టాఫీస్.. రిక‌రింగ్‌ డిపాజిట్‌.. ఏది మేలు?

రిక‌రింగ్ డిపాజిట్లు‌(ఆర్‌డీ) బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న ట‌ర్మ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటాయి. ఈ ఖాతాలో ముందుగా నిర్ణ‌యించిన మొత్తాన్ని, ముందుగా నిర్ణ‌యించిన వ్య‌వ‌ధుల‌లో జ‌మ చేయాల్సి ఉంటుంది. ఒక్క‌సారి నెల‌వారీ చెల్లించిన మొత్తం నిర్ణ‌యించిన త‌రువాత మార్చుకునే వీలులేదు. ఆర్‌డీ ఖాతాల‌ను బ్యాంకుల‌లో గానీ పోస్టాఫీసులో గానీ తెరవ‌చ్చు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు  ఇత‌ర బ్యాంకుల‌లోనూ ఈ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఎస్‌బీఐ vs పోస్ట్ ఆఫీస్:

1. ఎస్‌బీఐ సాధార‌ణ ప్రజ‌ల‌కు అందించే రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా వ‌డ్డీ రేట్లు 5 నుంచి 5.4 శాతం మ‌ధ్య‌లో ఉంటాయి.  సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మ‌రో 50బేసిస్ పాయింట్లు అధికంటే వ‌డ్డీ రేటు ఉంటుంది.  ఈ వ‌డ్డీ రేట్లు జ‌న‌వ‌రి 8,2021 నుంచి అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు త‌మ ఆర్‌డీ ఖాతాదారుల‌కు 5.8 శాతం వార్షిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తుంది. ఈ వ‌డ్డీ రేటు జ‌న‌వ‌రి1, 2021 నుంచి అమ‌లులో ఉంది. 

2. ఒక సంవ‌త్స‌రం నుంచి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వేరు వేరు కాల‌ప‌రిమితి గ‌ల  రిక‌రింగ్ డిపాజిట్లను ఎస్‌బీఐ అందుబాటులో ఉంచింది. పోస్టాఫీస్ 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి మాత్ర‌మే ఆర్‌డీ అందిస్తుంది. 

3. ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాను చెక్కు/ న‌గ‌దు ద్వారా తెర‌వ‌చ్చు. కానీ పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాను న‌గ‌దు ద్వారా మాత్ర‌మే తెరిచే వీలుంది. 

4. ఆన్‌లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాను తెర‌వ‌చ్చు. అయితే పోస్టాఫీసు ఆర్‌డీ ఖాతాను తెరిచేందుకు పోస్టాఫీసు బ్రాంచ్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. 

5. ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాలో, క‌నీసం రూ.100తో ప్రారంభించి (రూ.110, రూ.120 ... చొప్పున 10 గుణిజాల‌లో‌) ఎంతైనా డిపాజిట్ చేయ‌వ‌చ్చు. గ‌రిష్ట ప‌రిమితి లేదు. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాను క‌నీసం రూ.10తో ప్రారంభించ‌వ‌చ్చు. 5 గుణిజాల‌లో(రూ.15, రూ.20, రూ.25.. చొప్పున‌) ఎంతైన డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఇందులో కూడా గ‌రిష్ట ప‌రిమితి లేదు. 

6. ఐదు సంవ‌త్స‌రాల పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతా వ‌డ్డీ రేటును ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది.  ఎస్‌బీఐ వ‌డ్డీ రేటు టెన్యూర్ ప్రాతిప‌దిక‌న మారుతుంది. 

జ‌న‌వ‌రి 8,2021 నుంచి అమ‌లులో ఉన్న‌ ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతా వ‌డ్డీ రేట్లు:
* ఒక సంవ‌త్స‌రం నుంచి రెండేళ్ళ‌ ‌లోపు డిపాజిట్ల‌కు - 4.9 శాతం
* రెండేళ్ళ నుంచి మూడేళ్ళ‌లోపు డిపాజిట్ల‌కు - 5.1 శాతం
* మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ‌ లోపు డిపాజిట్ల‌కు - 5.3 శాతం
* ఐదేళ్ళ నుంచి ప‌దేళ్ళ లోపు డిపాజిట్ల‌కు - 5.4 శాతం

పోస్టాఫీస్ ఐదేళ్ళ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాకు 5.8శాతం వార్షిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తుంది. ఈ రేటు జ‌న‌వ‌రి 1,2021 నుంచి వ‌ర్తిస్తుంది. వ‌డ్డీని త్రైమాసికంగా కాంపౌండ్ చేస్తారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని