SBI Q4: భారీ లాభాలు ప్రకటించిన ఎస్‌బీఐ - SBI Q4 net profit jumps to Rs 6451 crore on lower provisioning
close

Updated : 21/05/2021 18:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SBI Q4: భారీ లాభాలు ప్రకటించిన ఎస్‌బీఐ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంకు(ఎస్‌బీఐ) భారీ లాభాలను ప్రకటించింది. నేడు ఆ బ్యాంక్‌ 2020-21 నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంకింగ్‌ వ్యాప్యారంలో మొత్తం రూ.6,450 కోట్ల నికరలాభం ప్రకటించింది. ముఖ్యంగా మొండి బకాయిల మీద ప్రొవిజన్లు తగ్గడం ఎస్‌బీఐకి కలిసొచ్చింది. ఈ సారి ప్రొవిజన్స్‌ అండ్‌ కంటెజెన్సీ ఫండ్‌కు కేటాయింపులు 18.11శాతం తగ్గాయి. గతేడాది ఇదే సీజన్‌లో ప్రొవిజన్ల కింద రూ.13,495 కోట్లు కేటాయించగా.. ఈసారి అది రూ.9,914 కోట్లు కేటాయించారు. 

ఈ త్రైమాసికంలో పన్ను చెల్లింపునకు ముందు లాభం రూ.8,649 కోట్లుగా నిలిచింది. అదే గతేడాది రూ.4,970 కోట్లు మాత్రమే. ప్రొవిజన్ల ఏర్పాటుకు ముందు లాభం రూ.19,700 కోట్లు గతేడాది రూ.18,465 లభించాయి. గతేడాదితో 6.69శాతం లాభం పెరిగింది. ఇక బ్యాంక్‌ నిర్వహణ లాభాల్లో 13.66శాతం వృద్ధి కనిపించింది. కంపెనీకి వడ్డీలపై లభించే ఆదాయం పెరిగి రూ.27,067 కోట్లకు చేరింది.  

‘‘మార్చి త్రైమాసికంలో కొవిడ్‌ నిబంధనలు తొలగడంతో రుణ చెల్లింపుదారులకు కొంత ఊరట లభించింది.  దీంతోపాటు కోర్టు ఆదేశాల మేరకు  రూ.830 కోట్ల మేరకు వడ్డీ సొమ్మును వాపస్‌ చేశాము’’ అని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని