ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఉచిత ఐటీఆర్‌ ఫైలింగ్‌.. ఎలాగంటే? - SBI customers can file Income Tax Returns for free here is the step by step process
close

Updated : 07/10/2021 19:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఉచిత ఐటీఆర్‌ ఫైలింగ్‌.. ఎలాగంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? ఐటీఆర్ దాఖ‌లు చేయాల‌నుకుంటున్నారా? అయితే ఎస్‌బీఐ యోనో యాప్‌లోని ట్యాక్స్‌2విన్ ఆప్ష‌న్ ద్వారా ఉచితంగా ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు చేయొచ్చు. యోనో యాప్ ద్వారా ఐటీఆర్ దాఖ‌లు చేసే స‌దుపాయాన్ని అందిస్తున్న‌ట్లు ఇటీవలే ఎస్‌బీఐ ప్రకటించింది. మీరు కూడా యోనో యాప్ ద్వారా ఉచితంగా ప‌న్ను దాఖ‌లు చేయాల‌నుకుంటే ఈ కింది తెలిపిన ప‌త్రాలు ఏర్పాటు చేసుకోండి. 

యోనో యాప్ ద్వారా ఐటీఆర్ దాఖ‌లుకు కావ‌ల‌సిన ప‌త్రాలు..
1.
పాన్ కార్డ్‌
2. ఆధార్ కార్డ్‌
3. ఫారం-16
4. ప‌న్ను మిన‌హాయింపు వివ‌రాలు
5. వ‌డ్డీ ఆదాయం స‌ర్టిఫికెట్లు
6. ప‌న్ను ఆదా పెట్టుబ‌డికి సంబంధించిన‌ ఫ్రూఫ్‌లు

ఐటీఆర్ ఫైల్ చేయండిలా..
*
ముందుగా ఎస్‌బీఐ యోనో యాప్‌కు లాగిన్ అవ్వాలి.

* ‘షాప్స్ అండ్ ఆర్డర్స్‌’ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

* ‘ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్’ సెల‌క్ట్ చేసుకుని అక్క‌డ క‌నిపించే ‘ట్యాక్స్‌2విన్’ ఎంచుకోవాలి.

* ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన స‌మాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఆ స్టెప్స్‌ను ఫాలో అవుతూ ఐటీఆర్ సుల‌భంగా దాఖ‌లు చేయొచ్చు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని