ఎస్‌బీఐ చెక్కు లావాదేవీలు మ‌రింత భ‌ద్రం - SBI intoduces-positive-pay-system-to-make-cheque-payment-secure
close

Updated : 05/01/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ చెక్కు లావాదేవీలు మ‌రింత భ‌ద్రం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చెక్కుల ద్వారా లావాదేవీల‌కు మ‌రింత భ‌ద్ర‌త‌ కోసం 'పాజిటివ్ పే సిస్టమ్' ను రూపొందించింది. కొత్త నియమం ప్రకారం రూ.50,000 కంటే ఎక్కువ చెల్లింపులకు కీలక వివరాల పున-నిర్ధారణ అవసరం. ఈ కొత్త చెక్ చెల్లింపు నియమం 1 జనవరి 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో ఖాతా సంఖ్య‌ , చెక్ సంఖ్య‌, చెక్ మొత్తం, చెక్ చెల్లింపులకు సంబంధించి చెక్ తేదీ, చెల్లిస్తున్న వారి పేరు వంటి  వివరాల‌ను తెల‌పాల్సి ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొంది.

చెక్కుల ద్వారా చేసిన వాటితో సహా మీ లావాదేవీలన్నింటినీ సురక్షితంగా ఉంచేందుకు ఎస్‌బీఐ కృషిచేస్తుంది. చెక్ చెల్లింపును సురక్షితంగా చేయడానికి జనవరి 1 నుంచి పాజిటివ్ పే సిస్టమ్‌ను ప్రవేశపెడుతోంది" అని ఎస్బిఐ ట్వీట్ చేసింది.

బ్యాంకింగ్ మోసాలను తనిఖీ చేసే ప్రయత్నంలో  జనవరి 1, 2021 నుంచి చెక్కుల కోసం 'పాజిటివ్ పే సిస్టమ్' ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులను కోరిన తరువాత ఎస్‌బీఐ ఈ చర్య తీసుకుంది.

ఎస్‌బీఐ కొత్త నియమం గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు:

1) పాజిటివ్ పే ప్రక్రియ‌లో భాగంగా పెద్ద విలువ చెక్కుల  ముఖ్య వివరాలను తిరిగి ధృవీకరించే ప్రక్రియ ఉంటుంది.
2) చెక్ ఇచ్చేవారు ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎటిఎంల ద్వారా ఎస్‌బీఐ త‌గిన‌  వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
3) ఆ చెక్కు  కొన్ని కనీస వివరాలు (తేదీ, లబ్ధిదారుడి / చెల్లింపుదారుడి పేరు, మొత్తం మొదలైనవి) చెక్ ట్రంకేష్ సిస్ట‌మ్ (సీటీఎస్‌) పున‌ప‌రిశీలిస్తుంది.
4) ఏదైనా వ్యత్యాసం ఉంద‌ని సీటీఎస్ గుర్తిస్తే  త‌గిన‌ట్లుగా బ్యాంకులు పరిష్కార చర్యలు తీసుకుంటాయి.
5) భారతీయ రుణదాతలకు సదుపాయాన్ని కల్పించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను, ఆర్‌బీఐ ఆదేశించింది. దీని ద్వారా వారు డేటాను త్వరగా ధృవీకరించడానికి సిటిఎస్‌కు నేరుగా అనుసంధానించ‌వ‌చ్చు.

ఎస్‌బీఐ ఖాతాదారులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ చిరునామాకు చెక్ బుక్ డెలివరీ కోసం అభ్యర్థన చేయవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని