నేడు ఎస్బీఐ మెగా వేలం..!
ఇంటర్నెట్ డెస్క్: తాకట్టులో ఉన్న పలు ఆస్తులను ఎస్బీఐ మార్చి 5న ఈ-వేలం వేయనుంది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదో మంచి అవకాశమని ఎస్బీఐ పేర్కొంది. ఈ వేలంలో అన్నిరకాల ప్రాపర్టీలను వీటిల్లో విక్రయించనున్నట్లు తెలిపింది. నివాస ప్రాంగణాలు, గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు వంటివి వీటిల్లో ఉన్నట్లు ఎస్బీఐ ఒక ట్వీట్లో పేర్కొంది.
ఎవరైనా ఈ బిడ్లో పాల్గొనవచ్చని ఎస్బీఐ పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనలను పలు ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. వేలంలో ఉంచిన ఆస్తుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఇక తాకట్టులో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆయా బ్రాంచిల్లో సంబంధిత అధికారుల వివరాలను కూడా ఇచ్చింది.
* బిడ్లో పాల్గొనేవారు సదరు ఆస్తికి సంబంధించి ఎర్నెస్ట్ డిపాజిట్ ఆఫ్ మనీ ఉంచాలి.
* కేవైసీ పత్రాలను సదరు బ్రాంచ్లో సమర్పించాలి.
* బిడ్లో పాల్గొనేవారు ఈ-వేలందారుల వద్దగానీ, మరెవరైనా గుర్తింపు పొందిన ఏజెన్సీ నుంచి కానీ డిజిటల్ సిగ్నేచర్ తెచ్చుకోవాలి.
* ఈఎండీ, కేవైసీ పత్రాలు సమర్పించాక బిడ్లో పాల్గొనేవారికి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ పంపిస్తారు.
ఇవీ చదవండి
కొవాగ్జిన్ టీకా ప్రభావశీలత 81%
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?