కాంపౌండింగ్‌ నేరాల దర్యాప్తునకు సెబీ - SEBI approval is not mandatory for compounding‌ crime investigation
close

Published : 24/07/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాంపౌండింగ్‌ నేరాల దర్యాప్తునకు సెబీ

అనుమతి తప్పనిసరి కాదు సుప్రీం కోర్టు

దిల్లీ: సెబీ చట్టంలో సెక్షన్‌ 24ఏ కింద కాంపౌండింగ్‌ నేరాల దర్యాప్తునకు సెబీ సమ్మతి తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. అయితే సెక్యూరిటీల మార్కెట్‌లో స్థిరత్వం, మదుపర్ల రక్షణకు సెబీ అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరని వెల్లడించింది. విచారణ జరుగుతున్న కేసుల్లో సెబీ ఏ నిర్ణయాన్ని వీటో అధికారంతో తీసుకోలేదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. సెబీ నియంత్రణ సంస్థ అయినందున సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌), కోర్టులు సెబీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వివరించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని