భారత్‌లో టీకా తయారీకి అమెరికా చట్టం అడ్డుపుల్ల! - SII CEO Requests POTUS to lift Vaccine raw material export ban
close

Published : 16/04/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో టీకా తయారీకి అమెరికా చట్టం అడ్డుపుల్ల!

అమెరికా అధ్యక్షుడికి లేఖ రాసిన అదర్ ‌పూనావాలా

ముంబయి: వ్యాక్సిన్‌ తయారీలో అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలంటే నిషేధం ఎత్తివేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభవృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాను భారత్‌లో ఎస్‌ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశీయ అవసరాలతో పాటు ఇతర దేశాలకు కూడా సీరం టీకాల్ని ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే.

‘‘ముడి పదార్థాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుణ్ని కోరుతున్నాను. ఫలితంగా టీకా ఉత్పత్తిని వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు మీ పాలకవర్గం దగ్గర ఉన్నాయి. కరోనాను అంతం చేయడంలో మనమంతా కలిసి ముందుకు సాగాలంటే నిషేధం ఎత్తివేయక తప్పదు’’ అంటూ పూనావాలా ట్వీట్‌ చేశారు. ఈ సందేశానికి అమెరికా అధ్యక్షుడి ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు.

ముడి పదార్థాల సమస్యను పూనావాలా గత నెల జరిగిన ఓ సమావేశంలోనే ప్రస్తావించారు. అమెరికాలో ‘రక్షణ చట్టం’ అమల్లో ఉండడం వల్ల ఆ దేశంలో టీకాల తయారీకి కావాల్సిన కొన్ని ముడిపదార్థాలపై నిషేధం కొనసాగుతోంది. దీంతో అది ఇక్కడ టీకా తయారీకి పెద్ద అడ్డంకిగా మారింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని