రోగనిర్థారణ కెమేరాలుగా శామ్‌సంగ్‌ గెలాక్సీ ‌ఫోన్లు! - Samsung galaxy Phones as disease confirming cameras
close

Updated : 25/04/2021 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోగనిర్థారణ కెమేరాలుగా శామ్‌సంగ్‌ గెలాక్సీ ‌ఫోన్లు!

 

పాత గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను రోగ నిర్థారణ (మెడికల్‌ డయాగ్నోసిస్‌) కెమేరాలుగా మార్చనున్నట్లు టెక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ తెలిపింది. భారత్, వియత్నాం, మొరాకో, పపువా న్యూగినియా వంటి దేశాల్లో కంటి ఆరోగ్య సంరక్షణ మెరుగు పరచడానికి వీటిని వినియోగిస్తామని సంస్థ తెలిపింది. నేత్ర సమస్యలను గుర్తించే వైద్య పరికరాలను తయారు చేసేందుకు ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ బ్లైండ్‌నెస్‌ (ఐఏపీబీ), యోన్సే యూనివర్సిటీ హెల్త్‌ సిస్టమ్‌ (వైయూహెచ్‌ఎస్‌)లతో శామ్‌సంగ్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సరైన వైద్య నిర్థారణ పరీక్షలతో అంతర్జాతీయంగా 100 కోట్ల దృష్టి లోపాలున్న కేసులకు గెలాక్సీ అప్‌సైక్లింగ్‌ కార్యక్రమం పరిష్కారం చూపుతుందని శామ్‌సంగ్‌ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం.. 220 కోట్ల మంది కంటిచూపు సమస్యలతో బాధపడుతుండగా.. ఇందులో సగానికి పైగా కేసులను నివారించవచ్చు. గెలాక్సీ పరికరాలను వినూత్న పద్ధతుల్లో వినియోగించేందుకు 2017లో గెలాక్సీ అప్‌సైక్లింగ్‌ కార్యక్రమాన్ని శామ్‌సంగ్‌ తీసుకొచ్చింది. ఇందులో పాత గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ ఐలైక్‌ హ్యాండ్‌హెల్డ్‌ ఫండస్‌ కెమేరాగా పనిచేస్తుంది. కంటి పరీక్షకు లెన్స్‌గా కెమేరాను అనుసంధానం చేస్తారు. ఇక చిత్రాలను బంధించడానికి స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తారు. ఆ తర్వాత కంటి వ్యాధులను నిర్థారించడానికి గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ కృత్రిమ మేధ ఆల్గారిథమ్‌ వాడుతుంది. అనంతరం యాప్‌కు అనుసంధానమై రోగి వివరాలను పరిశీలించి, చికిత్స విధానం, ఇతర సమాచారాన్ని అందిస్తుంది. డయాబెటిక్‌ రెటినోపతి, గ్లకోమా సహా అంధత్వానికి దారితీసే పలు కేసులను ఈ కెమేరాల సాయంతో గుర్తించవచ్చని పేర్కొంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని