Saudi Aramco: రిలయన్స్‌ బోర్డులోకి అరామ్‌కో ప్రతినిధి..! - Saudi Aramco Representative May Be On Reliance Industries Board Say Sources
close

Published : 21/06/2021 20:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Saudi Aramco: రిలయన్స్‌ బోర్డులోకి అరామ్‌కో ప్రతినిధి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: సౌదీ అరామ్‌కో ఛైర్మన్‌, ఆ దేశ పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ గవర్నర్‌ యాసిర్‌ అల్‌ రుమయ్యన్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో చేరే అవకాశం ఉంది. అరామ్‌కో- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డీల్‌లో భాగంగానే ఇది జరిగే అవకాశం ఉంది. ఒక వేళ రిలయన్స్‌ బోర్డులో లేకపోయినా.. చమురు, రసాయనాల (ఓ2సీ) బోర్డులో అయినా ఆయనకు స్థానం దక్కే అవకాశం ఉంది. జూన్‌ 24న కంపెనీ ఏజీఏం సందర్భంగా వెల్లడించే అవకాశం ఉంది. 

2019లో ఏజీఎంలో చమురు రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ అరామ్‌కోకు విక్రయిస్తున్నట్లు ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు.  రిలయన్స్‌  చమురు రసాయనాల వ్యాపారం ముఖ్యంగా జామ్‌నగర్‌  రిఫైనరీల్లో కేంద్రీకృతమై ఉంటుంది. కాకపోతే ఈ డీల్‌ మార్చి 2020 నాటికి పూర్తి కావాల్సింది. కానీ, అనుకోని విధంగా ఆలస్యం జరిగింది. కారణాలను మాత్రం ఇరు కంపెనీలు వెల్లడించలేదు. ఈ ఏడాది ఇరు కంపెనీలు చర్చలను పునఃప్రారంభించాయి. ఈ సారి క్యాష్‌, షేర్‌ డీల్‌పై చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 
ఇటీవల రిలయన్స్‌ చమురు రసాయనాల వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా ప్రకటించింది. అంటే ఇది ఇప్పుడు జియోప్లాట్‌ఫామ్స్‌, రిలయన్స్‌ రిటైల్‌ కేటగిరిలోకి వచ్చింది. దీనిలోకి వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకొనేందుకు రిలయన్స్‌కు మార్గం సులువైంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని