close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120023851 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => gl_unnAPZKY [video_short_link] => gl_unnAPZKY [created_by] => [created_date] => [modified_by] => 8923881 [modified_date] => 2020-02-24 10:06:04.9849 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

భారత్‌పై అలక వీడని ట్రంప్‌..?

వాణిజ్య ఒప్పందంపై అనుమానం వ్యక్తం చేసిన అధ్యక్షుడు

వాషింగ్టన్‌: భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆశలపై నీలి నీడలు కమ్ముకొంటున్నాయి. ఇప్పట్లో ఇది కుదిరే అవకాశం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ‘‘భారత్‌తో ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, ఎన్నికలకు ముందే ఇది జరుగుతుందా లేదా అనేది చెప్పలేను. కానీ, మరింత విస్తృతమైన ఒప్పందం కోసం ప్రస్తుతానికి దీన్ని పక్కనబెడుతున్నాం’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 24న ట్రంప్‌ భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అంతా భావించారు. అ దిశగా చర్చలు కూడా జరిగినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. కానీ, ట్రంప్‌ వ్యాఖ్యలతో వాటిపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు, భారత్‌కు రానున్న ట్రంప్ బృందంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి లైట్‌హైజర్‌ ఉండే అవకాశం లేదని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. అయితే దీన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. లైట్‌హైజర్‌ నేతృత్వంలోనే భారత్‌తో అమెరికా వాణిజ్య చర్చలు జరిపింది. తాజాగా ఆయన పర్యటన బృందంలో లేకపోవచ్చన్న వార్తలు.. ఒప్పందం ఇప్పట్లో కుదిరే అవకాశం లేదన్న ట్రంప్‌ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది.

ఈ సందర్భంగా ట్రంప్‌ మరోసారి భారత్‌తో వాణిజ్య సంబంధాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యం విషయంలో అమెరికాకు భారత్‌ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూనే ప్రధాని మోదీతో ఉన్న మైత్రిని మరోసారి గుర్తుచేసుకున్నారు. విమానాశ్రయం, స్టేడియానికి మధ్య 70 లక్షల మంది స్వాగత్వం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మోదీ తనతో చెప్పారని ట్రంప్‌ మరోసారి ప్రస్తావించారు.

తాజా బడ్జెట్టే కారణమా..?

మరోవైపు పూర్తిస్థాయి ఒప్పందం కుదరకపోయినప్పటికీ.. పాక్షిక ఒప్పందం వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని మరికొంత మంది అధికారులు అభిప్రాయపడటం గమనార్హం. ఇటీవల ఇరు దేశాలు పెంచిన టారీఫ్‌లే ఒప్పందం ఖరారులో చిక్కుముడిగా మారినట్లు తెలుస్తోంది. స్టెంట్‌ల వంటి వైద్యపరికరాలకు భారత విపణిని మరింత సరళతరం చేయాలని అమెరికా కోరుతోంది. ఈ తరుణంలో తాజా బడ్జెట్‌లో వైద్యపరికరాల దిగుమతిపై సుంకాన్ని భారత్‌ మరింత పెంచింది. దీనిపై అగ్రరాజ్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై అమెరికా కూడా టారీఫ్‌లను పెంచింది. దీంతో భారత్‌కు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒప్పందం ఖరారు వాయిదా పడినట్లు సమాచారం.  

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.