స్కూటర్స్‌ ఇండియా మూసివేత! - Scooters‌ India Closure!
close

Published : 29/01/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్కూటర్స్‌ ఇండియా మూసివేత!

ఆమోదించిన ప్రభుత్వం

దిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ స్కూటర్స్‌ ఇండియాను మూసివేసేందుకు ప్రభుత్వం గురువారం అనుమతిచ్చింది. లఖ్‌నవూకు చెందిన ఈ సంస్థను మూసివేయడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) గత వారమే అంగీకారం తెలిపింది. భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మంత్రిత్వ శాఖ తమ కార్యకలాపాల నిలిపివేతకు ఆమోదం తెలిపినట్లు బీఎస్‌ఈకి స్కూటర్స్‌ ఇండియా సమాచారమిచ్చింది. మూసివేతకు అవసరమైన రూ.65.12 కోట్ల రుణాన్ని (వడ్డీతో కలిపి) కూడా భారత ప్రభుత్వం నుంచి స్కూటర్స్‌ ఇండియా కోరింది. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) లేదా స్వచ్ఛంద విభజన పథకం (వీఎస్‌ఎస్‌) అమలు చేయబోతోంది. వీఆర్‌ఎస్‌/వీఎస్‌ఎస్‌ పథకం ఎంచుకోని ఉద్యోగులను పారిశ్రామిక వివాదాల చట్టం 1947లోని నిబంధనల ప్రకారం తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీలో 100 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. స్కూటర్స్‌ ఇండియా బ్రాండ్‌ పేరును మాత్రం ప్రత్యేకంగా విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. ఎందుకంటే ఈ బ్రాండ్‌ కింద లాంబ్రెట్టా, విజయ్‌ సూపర్‌, విక్రమ్‌, లాంబ్రో వంటి అనేక బ్రాండ్లు ఉన్నాయి. విక్రమ్‌ బ్రాండ్‌ కింద కంపెనీ పలు రకాల త్రిచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీని మూసివేయడానికి ముందు ట్రేడ్‌మార్క్స్‌/బ్రాండ్లను నగదీకరించి, మూసివేత ప్రక్రియలో ఆ మొత్తాన్ని వినియోగించుకుంటామని స్కూటర్స్‌ ఇండియా తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని