మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు సెబీ కొత్త నిబంధ‌న‌లు - Sebi New rules for multi cap funds
close

Published : 25/12/2020 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు సెబీ కొత్త నిబంధ‌న‌లు

మ‌ల్టీ క్యాప్ ఫండ్ క‌నీసం 75 శాతం ఈక్విటీల‌కు కేటాయించాల్సి ఉంటుంది

మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌కు వ‌ర్తించే విధంగా సెబీ స‌రికొత్త పెట్టుబ‌డి నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించింది. లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్ విభాగాల్లో పెట్టుబడుల‌ను బ్యాలెన్స్ చేసేందుకు ఈ మార్పుల‌ను చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

సెబీ స‌ర్క్యులార్ ప్ర‌కారం , తాజాగా మారిన మ్యూచువ‌ల్ ఫండ్ల నిబంధ‌న‌లు:

  1. మ‌ల్టీ క్యాప్ ఫండ్ క‌నీసం 75 శాతం ఈక్విటీల‌కు కేటాయించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం అది 65 శాతంగా ఉంది.
  2. ఈక్విటీల‌కు, సంబంధిత ప‌థ‌కాల‌కు పెట్టుబ‌డుల కేటాయింపు ఈ విధంగా ఉండాలి.
  • లార్జ్ క్యాప్‌ల‌కు -25 శాతం
  • మిడ్ క్యాప్ కంపెనీల్లో 25 శాతం
  • స్మాల్ క్యాప్ కంపెనీల్లో -25 శాతం
    ప్ర‌స్తుతం ఫండ్ మేనేజ‌ర్లు వారి ఇష్టానుసారం పెట్లుబ‌డుల‌ను కేటాయిస్తున్నారు
  1. మార్కెట్ విలువలో అగ్ర స్థానంలో ఉన్న 100 కంపెనీల‌ను లార్జ్ క్యాప్‌లుగా ప‌రిగ‌ణిస్తారు. 100 నుంచి 250 వ‌ర‌కు మిడ్ క్యాప్‌, 250 నుంచి మిగ‌తా కంపెనీల‌ను స్మాల్ క్యాప్‌గా పేర్కొంటారు.
  2. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో యాంఫీ విడుద‌ల చేసే లార్జ్ క్యాప్‌, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల జాబితా విడుద‌ల చేయ‌నుంది. మ్యూచువ‌ల్ ఫండ సంస్థ‌లు జ‌న‌వ‌రి 31, 2021 లోపు ఈ నిబంధ‌న‌లకు మారాల‌ని గ‌డువు ఇచ్చింది.
  3. ప్ర‌స్తుతం మ‌ల్టీ క్యాప్ ఫండ్ల పోర్ట్‌ఫోలియో ఎక్కువ‌గా లార్జ్ క్యాప్ ఫండ్ల‌లో 65-90 శాతం కేటాయింపు ఉంటుంది. తాజా నిబంధ‌న‌ల ప్ర‌కారం మ్యూచువ‌ల్ ఫండ్లు 50 శాతం కంటే ఎక్కువ‌గా లార్జ్ క్యాప్‌ల్లో పెట్టుబ‌డుల‌కు కేటాయించ‌వ‌ద్దు.

Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని