ఎల్‌ఐసీ ఐపీవోకు మార్గం సుగమం - Sebi eases listing rules for large IPOs
close

Updated : 18/02/2021 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎల్‌ఐసీ ఐపీవోకు మార్గం సుగమం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎల్‌ఐసీ ఐపీవోకు వచ్చేందుకు వీలుగా సెక్యూరీటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజి బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) వేదికను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా పెద్ద కంపెనీల లిస్టింగ్‌ నిబంధనలను సవరించింది.  ఈ మేరకు రెగ్యూలేటరీ ఓ ప్రకటన చేసింది.  ‘‘ఇప్పుడు పెద్ద కంపెనీలు ఐపీవోకు రావాలంటే 10శాతం అవసరం లేదు.. సుమారు ఐదు శాతం వాటాలు విక్రయిస్తే చాలు. ఆ తర్వాత కూడా మూడేళ్లకు బదులు ఐదేళ్లలో 25శాతం వాటాలను ప్రజలకు కేటాయించే అవకాశం ఉంది’’ అని సెబీ పేర్కొంది.  ఈ నిర్ణయంతో భారీ కంపెనీలు మార్కెట్‌ లిస్టింగ్‌ మరింత సరళతరంగా మారింది. 

వాస్తవానికి ఎల్‌ఐసీ మార్కెట్లోకి రావడానికి కంపెనీ పరిమాణం కూడా అడ్డంకిగా మారింది. పాత నిబంధనల ప్రకారం ఇది మార్కెట్లోకి వస్తే  రూ.లక్ష కోట్లకు పైగానే అవసరం.  అప్పుడు మార్కెట్‌ దీనిని ఏమాత్రం తట్టుకొనే పరిస్థితి ఉండదు. దీంతోపాటు ఇష్యూ తర్వాత మార్కెట్‌ మూలధన విలువ పెరిగే కొద్దీ పబ్లిక్ వాటాలపై ఉన్న నిబంధనలను సరళతరం చేసింది.ఈ నిర్ణయం ఎల్‌ఐసీకి అత్యధికంగా ఉపయోగపడనుంది. బుధవారం జరిగిన సెబీ బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకొన్నారు.  ఫలితంగా ఒక్కసారిగా 10శాతం వాటాలకు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లకుండా.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే అవకాశం ప్రభుత్వానికి దక్కింది. ‘‘ఎల్‌ఐసీ వంటి భారీ ఐపీవోకు ఈ నిర్ణయం  ప్రయోజనకరం’’ అని సెబీ ఛైర్మన్‌ అజేయ్‌ త్యాగి పేర్కొన్నారు. 

ఇవీ చదవండి

ఆస్ట్రేలియాలో  వార్తాసేవలు నిలిపిపేసిన ఫేస్‌బుక్‌
టెలికాంకు రూ.12,000 కోట్లు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని