‘శాశ్వత బాండ్ల’పై వెనక్కి తగ్గిన సెబీ! - Sebi eases valuation norms for perpetual bonds on FinMin push
close

Updated : 23/03/2021 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘శాశ్వత బాండ్ల’పై వెనక్కి తగ్గిన సెబీ!

వాల్యుయేషన్‌ కోసం 100 ఏళ్ల కాలపరిమితి నిబంధనలో మార్పు

దిల్లీ‌: శాశ్వత బాండ్లుగా భావించే ఏటీ1 లేదా పర్పెచ్యువల్‌ బాండ్ల వాల్యుయేషన్‌ కోసం కాల పరిమితిని 100 ఏళ్లుగా పరిగణించాలన్న నిబంధనపై ఎట్టకేలకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ వెనక్కి తగ్గింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

మార్చి 31, 2022 వరకు బేస్‌-III ఏటీ-1 బాండ్ల కాలపరిమితి 10 ఏళ్లుగా ఉంటుందని స్పష్టం చేసింది. తర్వాత ఆరు నెలల్లో దాన్ని 20, 30 ఏళ్లుకు పెంచుతామని తెలిపింది. దీంతో ఏప్రిల్‌ 1, 2023 నుంచి ఏటీ-1 బాండ్ల కాలపరిమితి 100 ఏళ్లుగా ఉండనుంది. ఇక బేస్‌-III టైర్‌ 2 బాండ్ల కాలపరిమితిని మార్చి 2022 వరకు 10 ఏళ్లుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఒప్పందంలో పేర్కొన్న కాలపరిమితి కొనసాగుతుంది.

ఏటీ1 బాండ్ల వాల్యుయేషన్‌కు సంబంధించిన కొత్త నిబంధనల్ని సెబీ మార్చి 10న విడుదల చేసింది. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. 100 ఏళ్ల నిబంధనపై ఎంఎఫ్‌ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పర్పెచ్యువల్‌ బాండ్ల రీవాల్యుయేషన్‌ వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని తెలిపాయి. ఈ మేరకు ‘భారత మ్యూచువల్‌ ఫండ్ల సమాఖ్య(ఏఎంఎఫ్‌ఐ)’ సెబీని సంప్రదించింది. ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించి నిబంధనలు సామరస్యపూర్వకంగా అమలయ్యేలా చూడాలని కోరింది. ఈలోపు ఇది వివాదంగా మారడంతో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగింది. పర్పెచ్యువల్‌ బాండ్ల వాల్యుయేషన్‌ కోసం జారీ చేసిన 100 ఏళ్ల నియమాన్ని ఉపసంహరించుకోవాలని సెబీని ఆదేశించింది. ఈ మేరకు సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగికి కేంద్ర ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. ‘వాల్యుయేషన్‌ కోసం చేర్చిన ఆ నియమం తీవ్ర విఘాతం కలిగించేలా ఉంది’ అంటూ లేఖలో ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సెబీ తాజాగా వెనక్కి తగ్గింది.

ఇవీ చదవండి...

అదానీపరమైన గంగవరం పోర్టు!

5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ లక్ష్యం మూడేళ్లు వెనక్కి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని