భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు - Sensex Down by 300 pts
close

Published : 17/02/2021 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. బుధవారం 90 పాయింట్ల నష్టంతో 52,014 వద్ద సెన్సెక్స్‌ ప్రారంభమైంది. నిఫ్టీ 34 పాయింట్లు దిగజారి 15,279 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 312 పాయింట్లు నష్టపోయి 51,785 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 15,233 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, బ్యాంకింగ్‌, స్థిరాస్తి, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, లోహ రంగ షేర్లు నష్టాల్లో పయనిస్తుండడం సూచీలపై ప్రభావం చూపుతోంది. మరోవైపు ఇటీవలి భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతుండడంతో సూచీలు స్థిరీకరణ దిశగా పయనిస్తున్నాయి.

ఇంధన, టెలికాం, ఇన్‌ఫ్రా, విద్యుత్‌ రంగాల షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నప్పటికీ.. కీలక కంపెనీల షేర్లు నేలచూపులు చూడడం సూచీలను దిగజారుస్తున్నాయి. అదానీ పోర్ట్స్‌, హీరో మోటోకార్ప్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. నెస్లే ఇండియా, భారత్‌ పెట్రోలియం, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని