Stock Market: లాభాల్లో సూచీలు - Sensex Nifty Open Firm
close

Published : 07/06/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్లు లాభపడి 52,127 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 31 పాయింట్లు ఎగబాకి 15,701 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.90 వద్ద ట్రేడవుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా చూస్తే.. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడం, రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా ఉండటం మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. 

సెన్సెక్స్‌ 30 సూచీలో ఆరు మినహా అన్ని షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఐటీసీ, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌ షేర్లు రాణిస్తుండగా.. బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని