ఐటీ, ఆటో దూకుడు.. భారీ లాభాల్లో మార్కెట్లు - Sensex Nifty end at record closing highs
close

Updated : 08/01/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీ, ఆటో దూకుడు.. భారీ లాభాల్లో మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు రాణించడం, దేశీయంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు వడివడిగా అడుగులు పడుతుండడం, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వంటి పరిణామాలు సెంటిమెంట్‌ను బలపర్చాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ రంగ షేర్లు రాణించడంతో మరోసారి సూచీలు జీవనకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 700 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 14,350 ఎగువన ముగిసింది. 

ఉదయం 48,441 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా అదే ఒరవడిని కొనసాగించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ షేర్లతో పాటు, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ వంటి ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో 750 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్‌.. చివరికి 689.19 పాయింట్ల లాభంతో 48,782.51 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 209.90 పాయింట్ల లాభంతో 14,347.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.24గా ఉంది. నిఫ్టీలో మారుతీ సుజుకీ, విప్రో, టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. టెలికాం, మెటల్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి.

ఇవీ చదవండి..
రుణం ఉండ‌గా మ‌రో రుణం ల‌భిస్తుందా?
ధరలు పెంచిన మహీంద్రా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని