ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు - Sensex Nifty end flat
close

Updated : 31/12/2020 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. గత కొంతకాలంగా వరుస లాభాలతో దూసుకెళ్తూ వస్తున్న మార్కెట్లు ఏడాది చివరి రోజును మాత్రం సాదాసీదాగా ముగించాయి. ఉదయం 47,649 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. చివరికి కేవలం 5.11 పాయింట్ల లాభంతో 47,751.33 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.20 పాయింట్ల నష్టంతో 13,981 వద్ద ముగిసింది. చరిత్రలో తొలిసారి నిఫ్టీ 14వేల మార్క్‌ దాటినప్పటికీ మదుపరులు అప్రమత్తతతో ఎంతోసేపు ఆ మైలురాయిని నిలుపుకోలేకపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.07గా ఉంది. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. శ్రీసిమెంట్స్‌, టాటా కన్సల్టెన్సీ, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

భయాల నుంచి కొత్త గరిష్ఠాలకు
2020లో దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. కరోనా కారణంగా భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు.. చివర్లో దూకుడుగా ముందుకు సాగి కొత్త గరిష్ఠాలను నెలకొల్పాయి. జనవరి 1న సెన్సెక్స్‌ 41,306 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,190 వద్ద ముగిశాయి. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు లాభాల్లోకి వెళ్లినా తర్వాత నష్టాలు చవిచూశాయి. ఒకానొక దశలో కొవిడ్‌ భయాలతో సెన్సెక్స్‌ 26 వేల స్థాయికి పడిపోయింది. నిఫ్టీ సైతం 7 వేల స్థాయికి చేరింది. ఆ సమయంలో మదుపరులు స్టాక్‌ మార్కెట్‌ పేరు చెప్తేనే భయపడే స్థితి నెలకొంది. ఆ తర్వాత క్రమంగా పడుతూ లేస్తూ వచ్చిన మార్కెట్లు గత కొంతకాలంగా కోలుకుంటున్నాయి. వ్యాక్సిన్‌ అంచనాలతో కొత్త గరిష్ఠాలను చేరుకున్నాయి. మొత్తంగా ఈ ఏడాది సెన్సెక్స్‌ 6వేల పాయింట్లు, నిఫ్టీ 2వేల పాయింట్ల మేర లాభపడ్డాయి.

ఇవీ చదవండి..

కొత్త సంవత్సరానికి జియో గుడ్‌న్యూస్‌
జనవరి, 2021 నుంచి పెరగనున్న కార్ల ధరలు..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని