ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు - Sensex Nifty end flat
close

Updated : 10/02/2021 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇటీవల జీవనకాల గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అదే సమయంలో ఆటో, రియల్టీ వంటి షేర్లు రాణించడంతో వరుసగా రెండో రోజూ స్వల్ప నష్టాలతో సూచీలు బయటపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.84గా ఉంది.

ఉదయం 51,446 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీ.. చివరికి 19.69 పాయింట్ల నష్టంతో 51,309 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 2.80 పాయింట్ల నష్టంతో 15,106.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

ఇవీ చదవండి..
హైదరాబాద్‌లో రూ.91 దాటిన పెట్రోల్‌
డిజిలాక‌ర్‌లో బీమా పాల‌సీ ప‌త్రాలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని