Stock market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు - Sensex Nifty end marginally lower on profit-booking
close

Updated : 01/06/2021 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో లాభాల్లోకి దూసుకెళ్లిన సూచీలు.. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి.

ఉదయం 52,039 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లో కదలాడింది. చివర్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. చివరికి 2.56 పాయింట్ల నష్టపోయి 51,934.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 7.95 పాయింట్లు కోల్పోయి 15,574.85 వద్ద స్థిరపింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.90గా ఉంది.

నిఫ్టీలో అదానీ పోర్ట్స్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ షేర్లు లాభ పడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఇన్‌ఫ్రా, ఐటీ, ఎనర్జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా.. బ్యాంక్‌, ఆటో, మెటల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని