నష్టాలతో మొదలై.. లాభాల్లోకి.. - Sensex Nifty pare gains after hitting fresh lifetime high
close

Updated : 03/02/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాలతో మొదలై.. లాభాల్లోకి..

ఇంటర్నెట్‌డెస్క్‌: నేడు ప్రీమార్కెట్‌లో సెన్సెక్స్‌ లాభపడి 50,231 పాయింట్లు దాటి సరికొత్త శిఖరాన్ని చేరింది. కాకపోతే సూచీలు మాత్రం లాభనష్టాల మధ్య ఊగిసలాడతున్నాయి. తొలుత సూచీల ట్రేడింగ్‌ నష్టాల్లో ప్రారంభమైనా.. ఆ తర్వాత  కోలుకొని లాభాల్లోకి చేరింది. ఉదయం 9.45 సమయంలో సెన్సెక్స్‌ 225 పాయింట్ల లాభంతో 50,023 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 14,715 వద్ద ట్రేడవుతున్నాయి. కొటాక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ముఖ్యంగా నిఫ్టీ ఫార్మాసూచీ 2శాతానికి పైగా పెరిగింది. ఆస్ట్రాల్‌ పాలీ టెక్నిక్‌, యూనికామ్‌ ల్యాబ్‌, సోమన్య హోం ఇన్నోవేటివ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఈపీఎల్ ఎల్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ప్రధాన రంగాల సూచీలన్నీ సానుకూలంగానే ట్రేడవుతున్నాయి. నేడు మొత్తం 88 కంపెనీల షేర్లు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిలో భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జుబ్లియంట్‌ ఫుడ్‌వర్క్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. దీంతోపాటు హోంఫస్ట్‌ ఫైనాన్స్‌ సంస్థ షేర్లు మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ సంస్థ రూ.1,154 కోట్లు విలువైన ఐపీవోకు వచ్చింది.

ఇవీ చదవండి

అమెజాన్‌ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్‌

అమెరికాకు ‘కొవాగ్జిన్‌’ టీకా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని