ఆద్యంతం హుషారుగా కదిలిన సూచీలు - Sensex Rallies 610 Points
close

Updated : 15/02/2021 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆద్యంతం హుషారుగా కదిలిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఆద్యంతం హుషారుగా పరుగులు తీశాయి. కీలక కంపెనీల షేర్లు రాణించడంతో కొత్త గరిష్ఠాలు నమోదయ్యాయి. తొలిసారి సెన్సెక్స్‌ 52వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 15,300 పైన ట్రేడయింది. ఉదయం 374 పాయింట్ల లాభంతో 51,918 వద్ద శుభారంభం చేసిన సెన్సెక్స్‌ చివరకు 609 పాయింట్లు లాభపడి 52,154 వద్ద ముగిసింది. అదే ట్రెండ్‌ను కొనసాగించిన నిఫ్టీ.. 15,163 ప్రారంభమై 157 పాయింట్లు ఎగిసింది. 15,314 వద్ద ముగిసి జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో రూపాయి మారకం విలువ ఏడు పైసలు బలపడి రూ.72.68 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు అందుకున్న మార్కెట్లకు బ్యాంకింగ్‌, ఆర్థిక, స్థిరాస్తి, పీఎస్‌యూ, టెలికాం, ఇన్‌ఫ్రా రంగాలు అండగా నిలవడంతో సూచీలు హుషారుగా కదలాడాయి. ఎఫ్‌ఐఐ పెట్టుబడుల వెల్లువ, రిటైల్‌ ద్రవ్యోల్బణం కనిష్ఠానికి చేరడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలోకి రావడం వంటి గతవారపు సానుకూల సంకేతాలూ మదుపర్ల సెంటిమెంటును పెంచాయి.

ఉదయం మిశ్రమంగా కదలాడిన వివిధ రంగాల సూచీలు క్రమంగా కోలుకొని లాభాల్లోకి జారుకున్నాయి. బ్యాంకింగ్‌ రంగ సూచీ అత్యధికంగా 3.25 శాతం మేర లాభపడగా.. ఆర్థిక రంగం 2.66 శాతం, స్థిరాస్తి 1.53 శాతం, టెలికాం 0.88 శాతం లాభపడ్డాయి. ఇంధనం రంగం 0.24 శాతం, లోహ రంగం 0.42 శాతం, ఐటీ 0.55 శాతం నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా 6.02 శాతం ఎగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 4.13 శాతం, ఎస్‌బీఐ 3.96 శాతం, బజాజ్‌ ఫినాన్స్‌ 3.54 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2.99 శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు 2.23 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2.07 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 1.75 శాతం, టాటా స్టీల్‌ 1.50 శాతం, హీరో మోటోకార్ప్‌ షేర్లు 1.49 శాతం నష్టాల్ని చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని