సెన్సెక్స్‌ 51,000+.. - Sensex above 51K
close

Published : 25/02/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెన్సెక్స్‌ 51,000+..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలకు తోడు మెటల్‌, ఎనర్జీ షేర్ల అండతో సూచీలు లాభాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్‌ మరోసారి 51వేల మార్కును దాటగా.. నిఫ్టీ 15,100కు కొద్ది దూరంలో ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.42గా ఉంది.

ఉదయం 51,211 వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు కొనసాగించింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లిన సూచీ చివరికి 257.62 పాయింట్ల లాభంతో 51,039.31 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 115.35 పాయింట్ల లాభంతో 15,097.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో కోల్‌ ఇండియా, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, టైటాన్‌ కంపెనీ, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి.

ఇవీ చదవండి..
పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించొచ్చు: ఆర్‌బీఐ
కీల‌క మైలురాయి దాటిన‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని