close

Published : 14/01/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సరికొత్త గరిష్ఠాలకు స్టాక్‌మార్కెట్లు

ముంబయి: సంక్రాంతి పండగ రోజున దేశీయ సూచీలు దూసుకెళ్లాయి. బుధవారం నాటి నష్టాల నుంచి కోలుకుని సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. బీఎస్‌ఈ సెన్సెన్స్‌ 92 పాయింట్లు లాభపడి, 49,584 వద్ద ముగియగా, 30 పాయింట్ల లాభంతో నిఫ్టీ 14,595 వద్ద స్థిరపడింది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 150 పాయింట్లు కోల్పోయి 49,338 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించింది. నిఫ్టీ కూడా 47 పాయింట్ల నష్టంతో 14,500 పాయింట్ల వద్ద ఊగిలాటకు గురైంది. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 49,182 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఉదయం 11గంటల తర్వాత నెమ్మదిగా కోలుకున్న సూచీలు లాభాల బాటపట్టాయి. ముఖ్యంగా టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్ల అండతో లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు కూడా మార్కెట్‌కు కలిసొచ్చాయి.

గురువారం నాటి ట్రేడింగ్‌లో యూపీఎల్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌,ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐవోసీ షేర్లు లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని