నష్టాల్లో ముగిసిన మార్కెట్లు! - Sensex closed in red
close

Updated : 22/03/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌ను నష్టాల్లో ముగించాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. అయితే చివరిలో కీలక కంపెనీల షేర్ల దన్నుతో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకోగలిగాయి. ఉదయం 49,878 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 49,281 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం 49,878 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 86 పాయింట్లు నష్టపోయి 49,771 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,736 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,763-14,597 మధ్య కదలాడింది. చివరకు 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 14,736 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.36 వద్ద నిలిచింది.

అమెరికా మార్కెట్లు గతవారాన్ని మిశ్రమంగా ముగించాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం నేడు మిశ్రమంగానే కదలాడాయి. టర్కీ కరెన్సీ లిరా విలువ 17 శాతం పడిపోవడం ఆసియా సూచీలపై ప్రభావం చూపింది. అమెరికాలో బాండ్ల ప్రతిఫలాలు మళ్లీ పెరగొచ్చన్న అంచనాలు కూడా మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ పరిణామాలు దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. వీటితో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు కుంగడం మరింత దెబ్బతీసింది. అయితే, మధ్యాహ్నం తర్వాత స్థిరాస్తి, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, టెక్‌, బేసిక్‌ మెటీరియల్‌ రంగా సూచీలు రాణించడం నష్టాల్ని కొంత అదుపు చేయగలిగాయి.

అదానీ పోర్ట్స్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాలను ఆర్జించగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని