నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Sensex dips 100 pts in early trade
close

Updated : 04/02/2021 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మూడు రోజుల తర్వాత తొలిసారి నష్టాల్లోకి చేరాయి. ఉదయం 9.39 సమయంలో సెన్సెక్స్‌ 247 పాయింట్లు పతనమై 50,008 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు తగ్గి 14,742 వద్ద ఉన్నాయి. ప్రిన్స్‌పైప్‌ అండ్‌ ఫింట్‌, హింద్‌కాపర్‌, సొమాని హోం ఇన్నోవేట్‌, జుబ్లియంట్‌ ఫుడ్‌వర్క్‌, అపోలో టైర్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫినాన్స్‌, ఫ్యూచర్‌ సప్లై ఛైన్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 
 భారీ లాభాల అనంతరం మదుపరులు లాభాల స్వీకరణ మొదలుపెట్టడంతో సూచీలు నష్టపోయాయి. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్ ‌ఇండ్‌ బ్యాంక్‌ ఒకశాతం వరకు నష్టపోయాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా,  ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో షేర్లు భారీగా లాభపడుతున్నాయి. 
నేడు ఎస్‌బీఐ, హీరోమోటో, అదానీ పవర్‌, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌టీపీసీ, టాటాపవర్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి కంపెనీలు డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను  ప్రకటించనున్నాయి. 

ఇవీ చదవండి

కిశోర్‌ బియానీపై సెబీ నిషేధం

డ్రోన్‌ పైలెట్లకు శిక్షణ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని